Shilpa Shetty: పోర్నోగ్రఫీ కేసు.. శిల్పాకి తెలిసే జరిగిందా..?

ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను పోర్నోగ్రఫీ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాపారంలో శిల్పాశెట్టికి కూడా భాగం ఉందని పోలీసులు ఆధారాలు సేకరించారు. రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి దంపతులు తమ కుమారుడి పేరు మీదనే వియాన్ అనే కంపెనీను మొదలుపెట్టారు. ఆ కంపెనీ పేరు మీదనే యాప్ లు రూపొందించిన.. పోర్న్ ఫిల్మ్ బిజినెస్ చేస్తున్నారు. ఈ కంపెనీలో శిల్పాశెట్టి డైరెక్టర్ గా ఉండేవారు. కానీ ఈ వ్యవహారం బయటపడిన తరువాత ఆమె తన డైరెక్టర్ పదవి రాజీనామా చేశారు.

రీసెంట్ గా ముంబైలో శిల్పాశెట్టి ఇంట్లో పోలీసులు ఆరు గంటలకు పైగా సోదాలు నిర్వహించారు. అనేక రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో చాలా పోర్న్ క్లిప్స్ ఉన్నాయని చెబుతున్నారు. అదెంతవరకు నిజమో గానీ.. ప్రస్తుతం శిల్పాశెట్టి కేంద్రంగానే ముంబై పోలీసుల విచారణ జరుగుతోంది. ఆమెకి ఈ బిజినెస్ ఏమైనా లింక్స్ ఉన్నాయా..? ఈ యాప్ లకు సంబంధించిన లావాదేవీల్లో ఏమైనా డబ్బులు అందాయా..? అనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

అయితే శిల్పాశెట్టికి తెలియకుండా రాజ్ కుంద్రా ఇలాంటి వ్యాపారం చేయరని అంటున్నారు. అసలు రాజ్ కుంద్రాకు సినీ నేపధ్యమే లేదని.. శిల్పాశెట్టి కారణంగానే ఆయన బాలీవుడ్ బిజినెస్ లోకి వచ్చారని.. కాబట్టి శిల్పాశెట్టి పాత్ర ఉండే ఉంటుందని అంచనా వేసి.. ఆ దిశగా విచారణ జరుపుతున్నారు పోలీసులు. ఆమె పేరుని కూడా ఎఫ్ఐఆర్‌ లో నమోదు చేసే అవకాశం ఉందని అంటున్నారు. శిల్పాశెట్టి మాత్రం తన భర్త అమాయకుడని.. ఆయన పోర్న్ సినిమాలు తీయలేదని.. అది ఎరోటిక్ కంటెంట్ అని చెబుతోంది.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus