మలయాళ నటుడు షైన్ టామ్ చాకో (Shine Tom Chacko) .. అంటే పెద్దగా మనకు గుర్తు రాకపోవచ్చు. అయితే నాని (Nani) ‘దసరా’ (Dasara) సినిమా విలన్ అంటే ఈజీగా చెప్పేస్తారు. ఆ తర్వాత నాగ శౌర్య (Naga Shourya) ‘రంగబలి’ (Rangabali) సినిమాలోనూ విలన్‌గా ఆకట్టుకున్నాడు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు డిలీట్ చేసి టాక్ ఆఫ్ ది సోషల్ మీడియా అయిపోయాడు. అవి అతని రీసెంట్ ఎంగేజ్‌మెంట్ ఫొటోలు కావడం గమనార్హం. ప్రస్తుతం ఎన్టీఆర్ (Jr NTR) ‘దేవర’ (Devara) సినిమాలోనూ నటిస్తున్న షైన్ టామ్ చాకో.. గత కొన్నాళ్లుగా ప్రేమ, రిలేషన్‌షిప్ సమాచారంతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు.
తనూజ అనే అమ్మాయితో ప్రేమలో మునిగి తేలిన అతను ఈ జనవరిలో తమ ప్రేమ బంధాన్ని ప్రకటించాడు. నిశ్చితార్థంతో ఆ అనౌన్స్‌మెంట్ చేశాడు. త్వరలో పెళ్లి తేదీ ప్రకటిస్తారని ఆసక్తిగా ఎదురుచూస్తుంటే.. తనూజతో పెళ్లి కాకుండానే బంధం ముగిసిందని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పాడు అంటున్నారు. తనూజాతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియా ఖాతాల నుండి తొలగించాడు షైన్ టామ్ చాకో. దీంతో ఇద్దరూ విడిపోయినట్లేనని అభిమానులు చర్చించుకుంటున్నారు. మరోవైపు ప్రస్తుతం తాను ‘సింగిల్’ అంటూ బ్రేకప్ వార్తల్ని ఖరారు చేశాడు షైన్.
‘తనూజతో బంధం కలుషితంగా మారింది. ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నప్పటికీ కలసి కొనసాగలేకపోయాం’ అని క్లారిటీ ఇచ్చాడని వార్తలొస్తున్నాయి. ఇక షైన్ టామ్ చాకోకు గతంలో తబితా మాథ్యూస్ అనే భార్య ఉంది. వీరికి కూతురు కూడా ఉంది. అయితే వీరు విడాకులు తీసుకున్న తర్వాతే తనూజను ప్రేమించాడు అని అంటున్నారు. అయితే ఇప్పుడు ఆమె నుండి ఎందుకు దూరంగా జరుగుతున్నాడు అనే విషయం మాత్రం క్లియర్‌గా చెప్పలేదు.
అయితే ఎంగేజ్‌మెంట్ తర్వాతే బ్రేక్ అవ్వడంతో ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు అయితే వస్తున్నాయి. 13 ఏళ్ల క్రితం కెరీర్‌ను ప్రారంభించిన షైన్ టామ్ చాకో అప్పటి నుండి ఏదో ఒక పాత్ర చేసుకుంటూ ఇప్పుడు వెర్సటైల్ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అతని చేతిలో పదుల సంఖ్యలో సినిమాలు ఉన్నాయట.