Shiva Rajkumar: పవన్, మహేశ్, ఎన్టీఆర్ గొప్పదనం చెప్పిన శివన్న.. ఏమన్నారంటే?

పునీత్ రాజ్ కుమార్ సోదరుడు శివరాజ్ కుమార్ గురించి సౌత్ సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శివరాజ్ కుమార్ నటించిన ఘోస్ట్ మూవీ దసరా కానుకగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాతో శివరాజ్ కుమార్ మరో సక్సెస్ ను సొంతం చేసుకోవడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఐదు భాషల్లో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుండటం గమనార్హం. అక్టోబర్ 1వ తేదీన ఈ సినిమా తెలుగు ట్రైలర్ రిలీజ్ కానుంది.

దసరా పండుగకు పెద్ద సినిమాల మధ్య పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమాకు ఎన్ని థియేటర్లు దక్కుతాయో చూడాల్సి ఉంది. శివరాజ్ కుమార్ ట్విట్టర్ లో ముచ్చటిస్తూ పవన్, మహేష్, తారక్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహేష్ తక్కువగా, మృదువుగా మాట్లాడే వ్యక్తి అని శివన్న అన్నారు. మహేష్ వృత్తిని ఎంతో ప్రేమిస్తాడని అందరితో గౌరవంగా ఉంటాడని మహేష్ పర్ఫామెన్స్ ను తెరపై చూడటం సంతోషాన్ని కలిగిస్తుందని ఆయన తెలిపారు.

మహేష్ కు ఎప్పుడూ మంచి జరగాలని కోరుకుంటానని (Shiva Rajkumar) శివరాజ్ కుమార్ కామెంట్లు చేశారు. పవన్ కళ్యాణ్ నాకు మంచి ఫ్రెండ్ అని పవన్ ఎంతో ఎనర్జిటిక్ గా ఉంటాడని ఆయన కామెంట్లు చేశారు. పవన్ మరిన్ని విజయాలను అందుకోవాలని ఆకాంక్షిస్తున్నానని శివరాజ్ కుమార్ చెప్పుకొచ్చారు. కన్నడ భాషలో మాట్లాడాలంటే విశాలమైన హృదయంతో పాటు మంచి మనస్సు ఉండాలని శివరాజ్ కుమార్ చెప్పుకొచ్చారు.

అలాంటి గొప్ప మనస్సు జూనియర్ ఎన్టీఆర్ కు ఉందని అందువల్లే తారక్ కన్నడ భాషలో మాట్లాడటంతో పాటు పాటలు కూడా పాడాడని ఆయన కామెంట్లు చేశారు. మా కుటుంబం తారక్ ను అభిమానిస్తుందని తారక్ ఫ్యాన్స్ అంటే నాకు కూడా ఇష్టమేనని శివరాజ్ కుమార్ తెలిపారు. శివరాజ్ కుమార్ వెల్లడించిన ఈ విషయాలు ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus