Balayya: బాలయ్యను అందుకే అందరూ అంత ఇష్టపడేద!

బాలకృష్ణ కోపమెక్కువ.. ఇది బయటకు కనిపిస్తుంది కాబట్టి చెప్పేస్తాం. కొంతమంద అయితే.. ఈ విషయాన్ని పట్టుకుని నానా రాద్దాంతం చేస్తుంటారు. అయితే ఇక్కడో విషయం బాలకృష్ణ అభిమానమూ ఎక్కువే, ప్రేమ కూడా ఎక్కువే. ఇవి బయటకు కనపడినా పెద్దగా వీటి గురించి ఎక్కువగా ఎక్కడా డిస్కషన్‌ జరగదు. ఆయన తన వాళ్ల మీద, తనకు బాగా దగ్గర వాళ్ల మీద చూపించే ప్రేమ, అభిమానం గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి సంఘటన ఒకటి మంగళవారం రాత్రి జరిగింది.

కన్నడ స్టార్‌ హీరో శివరాజ్‌ కుమార్‌ హీరోగా నటించిన ‘వేద’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఆ వేడుకకు ముఖ్య అతిథిగా నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం చూసి అభిమానులు మురిసిపోయారు. శివ రాజ్‌కుమార్‌ కోసం బాలయ్య చెప్పిన మాటలు విని ఫ్యాన్స్‌ ఖుష్ అయిపోయారు. ఆయన సినిమా ‘మఫ్టీ’లోని లుక్‌ ఆధారంగానే ‘వీర సింహా రెడ్డి’లో సీనియర్‌ బాలయ్య పాత్ర లుక్‌ పెట్టాం అని కూడా చెప్పడంతో ఫ్యాన్స్‌ డబుల్‌ ఖుష్‌.

ఇదంతా ఆనందం పార్ట్‌. అయితే కన్నీళ్లు పెట్టించి, భావోద్వేగానికి గురి చేసిన పార్ట్‌ ఇంకొకటి ఉంది. పునీత్ రాజ్‌కుమార్‌ ప్రస్తావన రాగానే శివరాజ్‌ కుమార్‌ కంటతడి పెట్టుకున్నారు. ఆ సమయంలో బాలయ్య.. శివ రాజ్‌కుమార్‌ భుజాన చేయివేసి ఓదార్చారు. ఆ సీన్‌ చూసినవాళ్లకు అన్నయ్యలా శివరాజ్‌కుమార్‌ పక్కన బాలయ్య కూర్చుని ఓదార్చారు అంటూ ఫ్యాన్స్‌ అంటున్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ ఫొటో వైరల్‌గా మారింది.

శివకుమార్‌ రాజ్‌కుమార్‌ సోదరుడు పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ గుండెపోటుతో కొన్ని నెలల క్రితం కన్నుమూసిన విషయం తెలిసిందే. తమ్ముడు అకాల మరణం శివరాజ్‌కుమార్‌ను కలచి వేసింది. అభిమనుల్లాగే ఆయన కూడా ఎప్పుడు పునీత్‌ ప్రస్తావన వచ్చినా భావోద్వేగానికి గురవుతున్నారు. ఆ సమయంలో ఆయనను కన్సోల్‌ చేయడం ఎవరివల్లా కావడం లేదు.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus