నెల రోజుల క్రితం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) వాళ్ళు చేసే కార్యక్రమాలు బాగున్నాయని ప్రతి ఒక్కరూ కీర్తించారు. శివాజీ రాజా అద్యక్షతన ఈ అసోసియేషన్ ఎన్నో మంచి పనులకు శ్రీకారం చుట్టాయి. అలాగే త్వరలోనే సొంత భవన నిర్మాణానికి నిధులసేకరణపై విదేశాల్లో షోలు కూడా నిర్వహిస్తున్నారు. అంతా సవ్యంగా జరుగుతున్న తరుణంలో నటి శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ అనే విషయాన్నీ మీడియాలో చర్చకు తెరలేపింది. అంతేకాదు ఛాంబర్ ఎదుట అర్ధ నగ్న ప్రదర్శన చేయడంతో.. ఒక్కసారిగా వేడి రాజుకుంది. ఆమె చేసిన చర్యను ఖండిస్తూ మా అధ్యక్షుడు శివాజీ రాజా శ్రీరెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేశారు. అక్కడ నుంచి గొడవ మరిన్ని మలుపులుతిరిగింది.
సురేష్ బాబు కొడుకు అభిరామ్ తో శ్రీ రెడ్డి శృంగార ఫోటోలను బయటపెట్టడం.. మరింత మంది శృంగార లీలలు లీక్ చేస్తాననడంతో.. శివాజీరాజా దిగిరాక తప్పలేదు. ఆమెపై నిషేధాన్ని ఎత్తివేశారు. దీంతో శ్రీ రెడ్డి కాస్త శ్రీ శక్తిగా మారి పవన్, పవన్ తల్లిని దూషించింది. ఆమె వెనుక వర్మ, కొన్ని రాజకీయ శక్తులున్నాయని తెలియడంతో ఈ వివాదం “మా” నుంచి కంట్రోల్ తప్పింది. దీంతో మెగా ఫ్యామిలీ మొత్తం ఒకటై ఈరోజు ఫిలిం ఛాంబర్ కి వచ్చి న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు. ఈ వివాదాలతో.. ప్రముఖుల నుంచి ఒత్తిడి.. రాజకీయ నాయకుల ప్రమేయాలతో శివాజీరాజా విసిగిపోయారు. తన పదవికి రాజీనామా చేశారు. మరి అసోసియేషన్ అతని రాజీనామాని ఆమోదిస్తున్నట్టు ఇంకా ప్రకటన చేయలేదు. రేపటి లోపున ఈ వివాదాలు ఓ కొలిక్కి రానున్నాయని ఫిలిం ఛాంబర్ ప్రముఖులు ఆశిస్తున్నారు.