ఒడిలో కూర్చోమని ఫోర్స్ చేశాడు.. యువ నటి కామెంట్స్ వైరల్
- July 30, 2026 / 04:12 PM ISTByFilmy Focus Desk
చిన్నతనంలో జరిగిన చేదు అనుభవాల్ని బయటకు చెప్పుకోవడానికి ఒకప్పుడు ఆడ పిల్లలు బయటకు చెప్పేవారు కాదు. ఇంట్లో ఏమంటారో, తననే తప్పు పడతారేమో అనే భయం లాంటివి ఉండేవి. అయితే ఇప్పుడు అమ్మాయిలు అలా లేరు లెండి. ఏదైనా అంటే అప్పటికప్పుడు రిటార్ట్ ఇచ్చేస్తున్నారు. ఇలా గత తరం అమ్మాయి, ఇప్పటి నటి ఒకరు ఇప్పుడు తనకు చిన్నతనంలో జరిగిన భయంకరమైన అనుభవాన్ని చెప్పుకొచ్చింది. ఆమెనే నటి శివాంగి జోషి.
Shivangi Joshi
రియాలిటీ షో ‘లాకప్ 2’లో కంటెస్టెంట్‌గా ఉన్న శివాంగి మాట్లాడుతూ.. చిన్నతనంలో తన బంధువే తనతో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పింది. నాకు మావయ్య వరుస అయ్యే వ్యక్తి నన్ను స్కూల్ నుండి ఇంటికి తీసుకువచ్చేవాడు. ఈ క్రమంలో మా అమ్మ అతడిని ఎంతో నమ్మేది. ఆ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని అతడు నాతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లాలంటే డ్రైవింగ్ నేర్చుకోవాలని, ఏవేవో చేయాలని ఒడిలో కూర్చోబెట్టుకుని ఏవేవో విషయాలు మాట్లాడేవాడు.

ఏం జరుగుతోంది, ఆయన ఉద్దేశం ఏమిటి అనేది అప్పుడు నాకు అర్థం కాలేదు. నా తల్లిదండ్రులు ఇంట్లో లేనప్పుడు లైంగిక వేధింపులకు ప్రయత్నించాడు. అయితే ఈ విషయం తెలిసి అమ్మానాన్న అతడిని ఇంటి నుండి బయటకు గెంటేశారు అని చెబుతూ శివాంగీ చెప్పి కన్నీరుమున్నీరైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా ఆమె తల్లి స్పందించారు. పిల్లలకు చిన్నతనం నుండి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి తల్లిదండ్రులు తప్పనిసరిగా అవగాహన కల్పించాలని కోరారు.
హిందీ సీరియల్‌తో ఆదరణ సొంతం చేసుకున్న శివాంగి.. 2020లో ‘లవ్ x సొసైటీ’ అనే సినిమా చేసింది. టీవీలో 2013లో ‘ఖేల్తీ హై జిందగీ ఆంఖ్ మిచోలీ’లో నటించింది. 2025లో ‘బడే అచ్చే లగ్తే హై 4’లో ఆఖరిగా టీవీలో కనిపించింది. ‘జబ్ వి వాచ్డ్’, ‘హార్ట్ బీట్స్’ వెబ్ సిరీస్‌ల్లో నటించింది.














