Shivani Rajashekar: చదువు కోసం శివానీ రాజశేఖర్ ఇంత త్యాగం చేసిందా?

  • June 30, 2022 / 11:05 AM IST

రాజశేఖర్ కూతురిగా పాపులారిటీని సంపాదించుకున్న శివానీ రాజశేఖర్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన శివాని నటిగా మంచి పేరు, గుర్తింపును సొంతం చేసుకున్నారు. అయితే తాజాగా శివాని మిస్ ఇండియా పోటీల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మిస్ ఇండియా పోటీల నుంచి తప్పుకుంటున్నానని ఆమె ప్రకటించారు. సోషల్ మీడియా ద్వారా శివాని ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు.

అందాల పోటీలకు సంబంధించిన ట్రైనింగ్, గ్రూమింగ్ సెషన్స్ ను దురదృష్టవశాత్తూ మిస్ అయ్యానని శివాని చెప్పుకొచ్చారు. మెడికల్ థియరీ పరీక్షల వల్ల ఈ విధంగా జరిగిందని ఆమె తెలిపారు. ఆ తర్వాత నేను మలేరియా బారిన పడ్డానని బౌన్స్ బ్యాక్ అవుతానని అనుకున్నానని ఆమె కామెంట్లు చేశారు. కానీ అనుకున్న విధంగా జరగలేదని ఆమె కామెంట్లు చేశారు. నా ప్రాక్టికల్ పరీక్షలు ముందుకు జరిగాయని ప్రాక్టికల్ పరీక్షలు ఇప్పటికే మొదలయ్యాయని ఆమె అన్నారు.

జులై నెల 3వ తేదీన మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలే జరగనుందని అయితే ఆరోజు కూడా నాకు పరీక్ష ఉందని ఆమె చెప్పుకొచ్చారు. మెడికల్ పరీక్షలు పూర్తైన తర్వాత మళ్లీ సినిమాలతో బిజీ అవుతానని ఆమె కామెంట్లు చేశారు. ప్రస్తుతం శివాని జీ5 ఓటీటీ కోసం రాజ్ తరుణ్ తో కలిసి ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు. అద్భుతం, శేఖర్ సినిమాలలో శివాని నటించగా అద్భుతం సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే శేఖర్ సినిమాకు మాత్రం ఫ్లాప్ టాక్ వచ్చింది.

అయితే సోషల్ మీడియాలో మాత్రం శివానికి భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. శివాని తర్వాత ప్రాజెక్ట్ లతో సక్సెస్ లను అందుకోవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. శివానికి సినిమాసినిమాకు క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం. చదువుకోసం శివానీ రాజశేఖర్ చేసిన త్యాగాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus