Virat, Anushka: విరుష్క దంపతులపై ప్రశంసలు కురిపించిన షోయబ్‌ అక్తర్‌!

  • September 10, 2022 / 01:48 PM IST

అనుష్క శర్మ బాలీవుడ్ నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె క్రికెటర్ విరాట్ కోహ్లీతో ప్రేమలో పడి ఆయనను వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారని చెప్పాలి.ఇక వీరికి పాప జన్మించిన తర్వాత అనుష్క పూర్తిగా సినిమాలను తగ్గించి తన కూతురి బాధ్యతలను చూసుకుంటూ ఉన్నారు. ఇక కోహ్లీ యధావిధిగా తన ఆటతీరుతో అభిమానులను సందడి చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి విరాట్ కోహ్లీ ఆట తీరుతో ఎంతో నిరాశ వ్యక్తం చేసిన

అభిమానులలో ఒక్కసారిగా కోహ్లీ ఉత్సాహాన్ని నింపారు. గురువారం ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో ఈయన 122 పరుగులతో నాట్ అవుట్ కావడంతో అభిమానులు కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున కోహ్లీ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈయన ఆటతీరుతో పలువురు క్రికెటర్లు సైతం ఈయనపై ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలోనే పాక్ క్రికెటర్ షోయబ్ అత్తర్ విరాట్ కోహ్లీ ఆట తీరుపై ప్రశంసలు కురిపించారు. విరాట్ కోహ్లీకి కంగ్రాట్స్ చెబుతూనే తాను ఎప్పుడు ఇలాగే ముందుకు కొనసాగుతూ ఉండాలి

తన మద్దతు ఎప్పుడూ ఉంటుంది అంటూ తన ఆట తీరుపై ప్రశంసలు కురిపించారు. మ్యాచ్‌ అనంతరం తన గడ్డు పరిస్థితుల్లో విరాట్ కోహ్లీకి తన భార్య అనుష్క శర్మ ఎంతో మద్దతుగా నిలిచిందనిచెప్పడమే కాకుండా హాట్సాఫ్ అనుష్క అద్భుతం చేసావ్ అంటూ ఈయన అనుష్క శర్మ పై ప్రశంసల కురిపించారు.

అనుష్క శర్మ ఐరన్ లేడీ విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ స్టీల్ అంటూ షోయబ్ అత్తర్ ఈ దంపతులపై ప్రశంసలు కురిపించారు. ఇలా విరాట్ కోహ్లీపై షోయబ్ అత్తర్ ఎంతో గొప్పగా మాట్లాడటంతో అభిమానులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus