Bigg Boss Telugu 7: ‘బిగ్ బాస్ 7’ కి ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్..!

‘బిగ్ బాస్ తెలుగు సీజన్ ౭’ కి రంగం సిద్ధమైంది. త్వరలోనే ఈ సీజన్ ప్రారంభం కానుంది. ఈసారి మరిన్ని సర్‌ప్రైజ్‌లు, థ్రిల్లింగ్‌ అంశాలు, భావోద్వేగాలు మిళితమై ఉంటాయని నిర్వాహకులు సోషల్‌ మీడియా ద్వారా ఓ వీడియోని పంచుకున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ కూడా స్టార్ మరియు డిస్నీ+ హాట్‌ స్టార్‌ ఓటీటీలోనూ స్ట్రీమింగ్‌ కానుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే హోస్ట్ ఎవరు అన్నది ఆ టైంలో చెప్పలేదు.

చాలా కాలంగా నాగార్జున ఈ షో నుండీ తప్పుకున్నట్టు ప్రచారం జరిగింది. కానీ అందులో నిజం లేదు అని ఈ మధ్యనే ఓ ప్రోమోతో క్లారిటీ ఇచ్చారు. అందులో నాగార్జున లుక్ కూడా ఆకట్టుకుంది. ఇక కంటెస్టెంట్ల గురించి డిస్కషన్ కూడా మొదలైంది. క్రికెటర్ వై.వేణుగోపాలరావు కూడా బిగ్ బాస్ 7 లో పాల్గొనబోతున్నట్టు టాక్ నడుస్తుంది. అలాగే స్టార్ కపుల్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు టాక్ నడుస్తుంది.

వాళ్ళతో పాటు ‘కార్తీక దీపం’ విలన్ అయిన శోభా శెట్టి కూడా ఈ సీజన్లో కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశాలు ఉన్నాయట. ‘కార్తీక దీపం’ సీరియల్ తో ఈమె చాలా పాపులర్ అయ్యింది. ఆ సీరియల్ కథ మొత్తం ఈమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది. అయితే ఆ సీరియల్ తర్వాత ఆమెకు అవకాశాలు పెద్దగా రాలేదు. ఓ సినిమాలో నటించింది. అది రిలీజ్ కాలేదు. సో ఈమె ప్రస్తుతం ఖాళీ. అందుకే బిగ్ బాస్ లో పాల్గొన బోతున్నట్టు సమాచారం.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus