Bigg Boss 7 Telugu: ఈవారం బిగ్ బాస్ ఇస్తున్న ట్విస్ట్ ఏంటి ? హౌస్ లోకి నాగార్జున వస్తున్నారా ?

బిగ్ బాస్ హౌస్ లో ఆరోవారం ఎలిమినేషన్ అనేది చాలా ఉత్కంఠంగా మారబోతోంది. ప్రస్తుతం అందరూ హౌస్ మేట్స్ కాబట్టి ఎలిమినేషన్ లో ఖచ్చితంగా ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు బిగ్ బాస్ అనే అంటున్నారు. అయితే, ఈసారి ఎలిమినేషన్ మిడ్ వీక్ ఉండబోతోందన అంచనాలు వేస్తున్నారు. ప్రస్తుతం అన్ అఫీషియల్ ఓటింగ్ పోల్స్ లో చూస్తే., నామినేషన్స్ లో ఉన్న ప్రిన్స్ యావర్ టాప్ లో ఉన్నాడు. ఆ తర్వాత అమర్ దీప్ ఉన్నాడు. వీళ్లిద్దరూ అయితే సేఫ్ జోన్ లో ఉన్నారు. ఇక మిగతా వాళ్లలోనే ఎలిమినేషన్ అనేది జరగబోతోంది.

ఇందులో టేస్టీ తేజ, అశ్విని, నయనీ పావనీ, పూజ మూర్తి ఇంకా శోభాశెట్టి ఉన్నారు. అయితే, చాలా మటుకు అన్ అఫీషియల్ సైట్స్ లో పూజామూర్తి, శోభాశెట్టి ఇద్దరే బోటమ్ లో ఉన్నారు. అందరికంటే కూడా వీరిద్దరికే ఓటింగ్ పర్సెంటేజ్ అనేది తక్కువగా జరుగుతోంది. అంతేకాదు, అశ్విని సైతం ఈవారం డేంజర్ జోన్ లోనే ఉంది. అందుకే, బిగ్ బాస్ ఈవారం ఎలిమినేషన్ లో ట్విస్ట్ ఇవ్వబోతున్నాడని చెప్తున్నారు. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటంటే., బిగ్ బాస్ హౌస్ లో ప్రారంభంలో హాలోగ్రామ్ దర్శిని అని ఒకటి ఏర్పాటు చేశారు దీని ద్వారా నాగార్జున ఎప్పుడైనా సరే వచ్చి హౌస్ మేట్స్ ని పలకరిస్తాడని చెప్పారు.

ఇప్పుడు ఇదే ప్రొసెస్ లో ఎలిమినేషన్ జరగబోతోందా అంటే అవుననే సోషల్ మీడియాలో టాక్ మొదలైంది. నాగార్జున హాలో గ్రామ్ దర్శిని ద్వారా యాక్టివిటీ రూమ్ లోకి వచ్చి డేంజర్ జోన్ లో ఉన్న వారిలో ఇద్దరిని ఎలిమినేట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఆ ఇద్దరినీ వీకెండ్ వరకూ కూడా సీక్రెట్ రూమ్ లోనే ఉంచుతారు. ఈ సీక్రెట్ రూమ్ నుంచీ వీకెండ్ హౌస్ మేట్స్ తో కాకుండా డైరెక్ట్ గా స్టేజ్ పైకి తీస్కుని వస్తారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా ఒకరిని ఎలిమినేట్ చేయమని హౌస్ మేట్స్ కి ఛాయిస్ ఇస్తారు. లేదా వీరిలో ఎవరు ఎలిమినేట్ అయ్యారో క్లారిటీగా చెప్పి ఇంటికి పంపించేసారు.

అయితే, డేంజర్ జోన్ లో ప్రస్తుతం శోభాశెట్టి ఇంకా పూజా మూర్తి ఇద్దరు మాత్రమే ఉన్నారు కాబట్టి ఈ ఇద్దరిలో ఒకరిని ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది. పూజామూర్తి ఇప్పుడు వచ్చింది కాబట్టి మరి కొన్ని వారాలు ఇంట్లో ఉంచుదాం అని భావిస్తే ఖచ్చితంగా శోభాశెట్టిని ఎలిమినేట్ చేస్తారు. మరి శోభాశెట్టి ఎలిమినేట్ అయితే ఇంట్లో వాళ్లు ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. ఈవారం (Bigg Boss 7 Telugu) అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ చూసినా కూడా శోబాశెట్టి లీస్ట్ లో ఉంది. అదీ మేటర్.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus