ఇటీవల కన్నడ యంగ్ హీరో చిరంజీవి షార్జా మరణించిన సంగతి తెలిసింది. అతి చిన్న వయసులోనే ఇతను చనిపోవడం పట్ల.. సినీ ప్రముఖులు అంతా బాధ పడుతూ.. వారి సంతాపాల్ని తెలియజేస్తూ వస్తున్నారు. మన యాక్షన్ కింగ్ అర్జున్ కు ఇతను స్వయానా మేనల్లుడట. జూన్ 7న మథ్యాహ్నం 3 గంటలకు ఇతనికి గుండెపోటు రావడంతో మృతి చెందాడు. గుండె పోటు వచ్చిన వెంటనే బంధుమిత్రులు అతన్ని అపోలో ఆస్పత్రిలో చేర్పించినా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
చిరంజీవి షార్జా వయసు కేవలం 39 సంవత్సరాలు మాత్రమే. అతను మొత్తం 19 సినిమాల్లో నటించాడు. 1980 అక్టోబర్ 17న బెంగళూరులో జన్మించిన చిరంజీవి షార్జా.. కెరీర్ ప్రారంభంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. అటు తర్వాత నటుడిగా మారినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే.. చిరంజీవి షార్జా మృతి చెందితే.. మన మెగాస్టార్ చిరంజీవి ఫోటో పెట్టి సంతాపాన్ని తెలియజేసింది శోభా డే. ‘మరో ధృవ తార రాలిపోయింది.సినీ పరిశ్రమకు చాలా పెద్ద నష్టం వాటిల్లింది’ అంటూ చిరంజీవి షార్జా నే ట్యాగ్ చేసింది శోభా.
కానీ ఫోటో మాత్రం మన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఫోటో పెట్టింది. ఆ తరువాత తప్పు తెలుసుకుని ఆ ట్వీట్ ను డిలీట్ చేసింది. అయితే ఆ లోపే నెటిజన్లు.. అలాగే మెగాస్టార్ ఫ్యాన్స్ ఆమెను ఓ ఆట ఆడేసుకున్నారు. ‘అంత పెద్ద మనిషి అయ్యి ఉండి.. విషయం ఏంటో తెలీకుండా ట్వీట్లు చేసేస్తున్నావా’ అంటూ ఆమె పై మండిపడ్డారు.