Sobhita: హ్యాపీ బర్త్ డే లవర్ అంటూ చైతూ కి విషెస్ చెప్పిన శోభిత….!

అక్కినేని నట వారసుడిగా 2009 సంవత్సరంలో జోష్ మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు నాగచైతన్య. ఆ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా వసూళ్లు రాబట్టలేకపోయింది. దాని తరువాత గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏమాయ చేసావే మూవీ సూపర్ హిట్ అవ్వటమే కాక చైతూ కి విమర్శకుల ప్రశంసలు కుడా అందించింది. ఈ మూవీ లో చైతూ సరసన సమంత హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత వీలు ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే ఇద్దరికి అభిప్రాయ బేధాలు రావటంతో, విడాకులు తీసుకున్నారు వీళ్ళు.

Sobhita

ఆ తరువాత ఎవరి సినిమాల్లో వాళ్ళు బిజీ బిజీగా వుంటూ. నాగ చైతన్య , మన తెలుగు నుంచి బాలీవుడ్ లో హీరోయిన్ గా సినిమాల్లో నటిస్తున్న శోభిత ధూళిపాళ్ల ను ఇష్టపడి , పెళ్లి చేసుకున్నాడు. వీరి వైవాహిక జీవితం చాలా అన్యోన్యంగా నడుస్తుంది. చైతన్య లాస్ట్ మూవీ తండేల్ కూడా మంచి టాక్ తో సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతానికి చైతన్య ” వృష కర్మ” అనే మూవీ లో నటిస్తున్నాడు. రీసెంట్ గానే సూపర్ స్టార్ మహేష్ బాబు చేతులా మీదుగా టైటిల్ రివీల్ చేశారు. ఇది ఇలా ఉండగా నాగ చైతన్య 39వ పుట్టినరోజు వేడుకను ఆయన భార్య శోభిత ధూళిపాళ్ల మరింత స్పెషల్ గా మార్చేశారు.

శోభిత షేర్ చేసిన రొమాంటిక్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇద్దరి కెమిస్ట్రీపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శోభిత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటో ద్వారా “హ్యాపీ బర్త్‌డే లవర్ నాగ చైతన్య” అని క్యాప్షన్ పెట్టారు. ఒక వెకేషన్ సమయంలో క్లిక్ చేసినట్టు కనిపిస్తున్న ఆ ఫోటోలో, రోడ్డుమధ్యలో నిలబడి ఉన్న శోభితకు నాగ చైతన్య ప్రేమగా జాకెట్ జిప్ వేస్తుండటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ పోస్ట్‌కు చైతన్య కూడా రెడ్ హార్ట్ ఎమోజీతో స్పందించడంతో, సోషల్ మీడియాలో వారి లవ్లీ మూమెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఎర్రబెల్లితో ఫొటో పంచాయితీ… క్లారిటీ ఇచ్చిన బ్రహ్మానందం.. ఏం చెప్పారంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus