Liger Movie: ‘లైగర్’ వెనుక కల్వకుంట్ల కవిత.. ఈడీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేత..!

తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొన్ని రోజులుగా ఎక్కువగా హాట్ టాపిక్ గా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఆమె పై ఎన్నో అవినీతి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితకు వాటాలున్నాయని, బీజేపీ(BJP) నేతలు ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో కవిత కోర్టును ఆశ్రయించి.. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో భాగంగా తనపై ఎవరూ ఆరోపణలు చేయకుండా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అయితే ఈ విషయమై మంగళవారం నాడు హైదరాబాద్‌లోని ఆమె సన్నిహితుల ఇళ్లల్లో ఈడీ సోదాలు నిర్వహించింది.

ఇదంతా ఒక వైపు అనుకుంటే.. ఇంకో వైపు తెలంగాణ కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ … ‘లైగర్’ సినిమాకి కవిత తన బ్లాక్‌మనీని పెట్టుబడిగా పెట్టారని, దీనిపై దర్యాప్తు చేపట్టాలని … ఆయన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌, సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశం అయ్యింది. ఈ విషయం పై జడ్సన్ స్పందిస్తూ.. “విజయ్ దేవరకొండ – పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన పాన్ ఇండియా సినిమా ‘లైగర్’ కు కవిత పెట్టుబడులు పెట్టారు. ఈ సినిమాలో వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్‌తో పాటు భారీ తారాగణం ఉన్నారు,

నిర్మాతలు ఖర్చుకు వెనుకాడకుండా చిత్రాన్ని భారీగా నిర్మించారు. హిట్లు లేకపోయినా విజయ్, పూరీ జగన్నాథ్‌ ల సినిమాకి ఇన్ని కోట్లు ఎవరు పెట్టారు? అంత ధైర్యం ఎవరికి ఉంటుంది. ఈ మధ్యనే కల్వకుంట్ల కవిత టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ తో ఓ మీటింగ్ పెట్టి విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా సినిమాలు తీయాలని ఆదేశాలు ఇచ్చిందా? లేదా? అలాగే భారీ బడ్జెట్‌తో నిర్మించిన ‘లైగర్’ సినిమా డిజాస్టర్ అయితే ఇంత నష్టాన్ని ఎవరు భరించారు? ఇటీవల విజయ్ దేవరకొండను కవిత తన ఇంటికి పిలిపించుకుని మాట్లాడింది.

తన దగ్గరున్న బ్లాక్‌ మనీని వైట్ చేసుకునేందుకు కవిత ‘లైగర్’ సినిమాలో భారీగా పెట్టుబడులు పెట్టింది. ఇది కేవలం మా ఆరోపణ కాదు.. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఈడీ, సీబీఐకి ఫిర్యాదు చేశాం.2017 లో డ్రగ్స్ కేసు విషయంలో పలువురు సినీ సెలబ్రెటీలను పిలిచి విచారించారు. ఇందులో పూరీ జగన్నాథ్, ఛార్మి కూడా ఉన్నారు. కొన్నాళ్ళకు వీరందరికీ క్లీన్ చిట్ వచ్చింది. అప్పటినుండే పూరీ, ఛార్మి కి కవితతో సత్సంబంధాలు పెరిగాయి.

తన దగ్గరున్న బ్లాక్‌మనీతో కవిత వీరి సినిమాలు నిర్మిస్తుంది. అందుకే లైగర్ ఫ్లాప్ అయినా కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు’ అంటూ ఆయన కవిత పై తీవ్ర ఆరోపణలు చేశారు. మరి ఈ విషయాల పై కవిత ఎలా రియాక్ట్ అవుతారు? జడ్సన్ కు ఎలాంటి కౌంటర్ ఇస్తారు? నిజంగానే పూరి- విజయ్ – ఛార్మి ల ‘లైగర్’ సినిమాకి కవిత పెట్టుబడులు పెట్టారా? వంటి డిస్కషన్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువయ్యాయి.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus