Varun Tej: అవి వేయించుకోవాలంటే వరుణ్ కు భయమట.. హైట్ వల్ల అలా చేస్తానంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు జయాపజయాలతో సంబంధం లేకుండా మార్కెట్ ను పెంచుకుంటున్న హీరోలలో వరుణ్ తేజ్ ఒకరు. తన అసలు పేరు సాయి వరుణ్ తేజ్ అని వరుణ్ తేజ్ వెల్లడించారు. స్క్రీన్ మీద ఈ పేరు పెద్దదిగా ఉంటుందని భావించి తన పేరులో సాయిని తీసేశానని ఆయన చెప్పుకొచ్చారు. నా సర్టిఫికెట్స్ లో, పాస్ పోర్ట్ లో సాయి వరుణ్ తేజ్ అని పేరు ఉంటుందని ఆయన అన్నారు.

వరుణ్ తేజ్ హైట్ 6 అడుగుల 4 అంగుళాలు కాగా కొన్ని సందర్భాల్లో హీరోయిన్ల హైట్ కు అనుగుణంగా అడ్జస్ట్ అయ్యి నటిస్తానని వరుణ్ తేజ్ వెల్లడించారు. నాకు టాటూలు అంటే ఇష్టమని అయితే టాటూలు వేయించుకోవడం అంటే ఎంతో భయమని ఆయన కామెంట్లు చేశారు. భవిష్యత్తులో తప్పకుండా టాటూలను వేయించుకుంటానని వరుణ్ తేజ్ పేర్కొన్నారు.

సినిమా బడ్జెట్ కు అనుగుణంగా పారితోషికం తీసుకుంటానని ఆయన (Varun Tej) అన్నారు. ఆపరేషన్ వాలంటైన్ మూవీ విడుదలైన తర్వాత వరుణ్ తేజ్ మట్కా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. కరుణ కుమార్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. మట్కా మూవీ కూడా ఈ ఏడాది విడుదల కానుందని సమాచారం అందుతోంది. ఆపరేషన్ వాలంటైన్ సినిమాకు శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించారు.

ఫస్ట్ ఏరియల్ బ్యాక్ డ్రాప్ మూవీగా ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. నిజ జీవిత ఘటనల ఆధారంగా ఆపరేషన్ వాలంటైన్ తెరకెక్కుతోంది. ఈ సినిమా చూసిన తర్వాత సైనికులపై ఎన్నో రెట్లు గౌరవం పెరుగుతుందని వరుణ్ తేజ్ వెల్లడించారు. ఈ సినిమాతో వరుణ్ తేజ్ పాన్ ఇండియా హిట్ ను అందుకుంటారని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఒకింత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిందని తెలుస్తోంది.

సుందరం మాస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!

మస్తు షేడ్స్ ఉన్నయ్ రా సినిమా రివ్యూ & రేటింగ్!
సిద్ధార్ధ్ రాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus