టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటులలో నవీన్ చంద్ర ఒకరు. అందాల రాక్షసి, అరవింద సమేత, మరికొన్ని సినిమాలతో గుర్తింపును సొంతం చేసుకున్న నవీన్ చంద్ర మంత్ ఆఫ్ మధు సినిమాతో మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే విడుదల కాగా ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ ట్రైలర్ కు దాదాపుగా 2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అయితే నవీన్ చంద్ర భార్య గురించి అభిమానులకు పెద్దగా తెలియదు. నవీన్ చంద్ర భార్య పేరు ఓర్మా కాగా ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. గతేడాది ప్రేమికుల రోజున సోషల్ మీడియా వేదికగా నవీన్ చంద్ర తన భార్యను పరిచయం చేశారు. ఓర్మా స్వస్థలం కేరళ కాగా ఓర్మా నవీన్ చంద్ర ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
ఎంతో టాలెంట్ ఉన్న నవీన్ చంద్ర కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారు. నేను కెరీర్ పరంగా సక్సెస్ సాధించడం వెనుక నా భార్య ఉన్నారని ఆయన కామెంట్లు చేశారు. ఓర్మా ప్రముఖ మలయాళ దర్శకుడు సిద్ధిఖ్ దగ్గర అసిస్టెంట్ గా పని చేశారని నా సినిమాల కథల ఎంపికలో కూడా తన వంతు సహకారం అందిస్తుందని నవీన్ చంద్ర అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.
ఓర్మా భవిష్యత్తులో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని నవీన్ చంద్ర చెబుతుండగా ఆ ప్రచారం నిజమవుతుందో లేదో చూడాల్సి ఉంది. మంత్ ఆఫ్ మధు సినిమాతో నవీన్ చంద్ర ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది. నవీన్ చంద్ర ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇతర భాషల్లో కూడా నవీన్ చంద్ర సక్సెస్ సాధించాలని అభిమానులు ఫీలవుతున్నారు.