బాలయ్య కొత్త సినిమాకి షాకింగ్ బడ్జెట్!

నందమూరి బాలకృష్ణకి సరైన హిట్ పడితే బాక్సాఫీస్ ఎలా షేక్ అవుతుందో ‘అఖండ’ సినిమా నిరూపించింది. ఆ సినిమాకి వంద కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. దీంతో బాలయ్య సినిమాలకు భారీ ఖర్చు పెట్టడానికి నిర్మాతలు వెనుకడుగు వేయడం లేదు. ప్రస్తుతం బాలయ్య.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘వీరసింహారెడ్డి’ అనే సినిమాలో నటిస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది. దీని తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.

బాలయ్య కెరీర్ లో 108వ సినిమా ఇది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై హరీష్ పెద్ది, సాహూ గారపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి దాదాపు రూ.90 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. అంత ఖర్చు చేస్తే వంద కోట్లకు పైగా బిజినెస్ జరగాలి. దానికి తగ్గ కలెక్షన్స్ రావాలి. ఇప్పుడు జనాల్లో బాలయ్య క్రేజ్ చూస్తుంటే.. వంద కోట్ల కలెక్షన్స్ పెద్ద విషయం కాదనిపిస్తుంది. అందుకే నిర్మాతలు ఇంత మొత్తం పెట్టడానికి రెడీ అవుతున్నారు.

ఈ మధ్యకాలంలో బాలయ్య తన సినిమాల్లో డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. అయితే అనిల్ రావిపూడి సినిమాలో మాత్రం ఆయనది సింగిల్ క్యారెక్టర్ అని తెలుస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ 8 నుంచి జరగబోతుందని సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్ నగర శివార్లలో సినిమా సెట్ వర్క్ జరుగుతోంది. అది పూర్తి కాగానే రెగ్యులర్ షూటింగ్ షురూ చేస్తారు.

ఈ సినిమాలో బాలయ్య సరసన సోనాక్షి సిన్హా హీరోయిన్ గా కనిపించనుందని సమాచారం. విలన్ గా బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్ పాల్ కనిపించనున్నారు. కథ ప్రకారం.. సినిమాలో బాలయ్యకు కూతురు కూడా ఉంటుందట. ఆ పాత్రలో ‘పెళ్లి సందడి’ ఫేమ్ శ్రీలీల కనిపించనుంది. అలానే మరో కీలక పాత్రలో నటి అంజలి కనిపించనుంది.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus