‘బ్రహ్మోత్సవం’ ఆడియో లాంచ్ కు రూ.2 కోట్లా.. ?

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మోత్సవం’. ప్రస్తుతం హైదరాబాద్ లో చివరి షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ చిత్రం సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి మిక్కి జే మేయర్ స్వరాలు సమకూరుస్తుండగా.. ఏప్రిల్ 10 న ఆడియో ను విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

మొదట ఈ ఆడియో ను తిరుపతి వేదికగా విడుదల చేయాలనుకున్నప్పటికీ.. పలు కారణాల రిత్యా ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ లోనే నిర్వహించనున్నట్లు సమాచారం. మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి భారీ సెట్ ను వేస్తుండగా.. ఈ ఆడియో ఆవిష్కరణ కోసం దాదాపు రూ.రెండు కోట్లను ఖర్చు చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల భోగట్టా. పీవీపీ సినిమా పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. మహేష్ సరసన కాజల్, సమంత, ప్రణీత జంటగా నటిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus