నందమూరి వంశం లో ఎన్టీ రామారావు తర్వాత ఆ వారసత్వాన్ని మరో లెవెల్ కు తీసుకువెల్లిన ఏకైక హీరో జూనియర్ ఎన్టీఆర్. చిన్నప్పటి నుంచి హీరోగా ఒక హోదా కు వచ్చిన తర్వాత కూడా నందమూరి వంశానికి ఎన్టీఆర్ కాస్త దూరంగానే ఉండాల్సి వచ్చింది. ఇక ఎవరు ఎంత దూరం పెట్టిన కూడా ఎన్టీఆర్ మాత్రం తను అనుకున్న దాని పై ఫోకస్ ను ఎక్కడ మళ్లించలేదు. ఎంతగానో హార్డ్ వర్క్ చేసి తారక్ ఇప్పుడు పాన్ ఇండియా వరకు వచ్చేశాడు.
ఎన్టీఆర్ తో సినిమాలు చేయాలని బాలీవుడ్ అగ్ర దర్శకనిర్మాతలు కూడా క్యూ కడుతున్నారు. RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ కూడా కెరీర్ ను సరైన ట్రాక్ లో పెట్టుకోవాలి అని ఆలోచిస్తున్నాడు. ఇక తన తదుపరి సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో స్టార్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాకు సంబంధించిన బడ్జెట్ వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ సినిమాను కొరటాల శివ స్నేహితుడు సుధాకర్ అలాగే ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
అయితే ఈ సినిమాకు మొదట రెండు వందల కోట్ల వరకు బడ్జెట్ అనుకున్నారట. ఇక RRR వచ్చిన తర్వాత బడ్జెట్ మరికొంత పెంసిగినట్లు తెలుస్తోంది. అసలైతే మొదట ఈ సినిమా కోసం రెండు వందల కోట్లు ఖర్చు చేయాలని అనుకున్నట్లు టాక్ వచ్చింది. ఇక RRR భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఈ సినిమాను మరింత గ్రాండ్ గా నిర్మించాలి అని దర్శక నిర్మాతలు ప్లాన్ వేసుకున్నట్లు సమాచారం.
దీంతో ఆ బడ్జెట్ మొత్తం 300 కోట్ల వరకు చేరుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ లో మొదలు పెట్టాలి అని కొరటాల శివ ప్లాన్ చేస్తున్నాడు. మరి జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి లేకుండా పాన్ ఇండియా మార్కెట్ ను ఏ స్థాయిలో కొనసాగిస్తాడో చూడాలి.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!