Sid Sriram: భాషా ప్రియుల ఆవేదన సిద్ శ్రీరామ్ కు అర్థమవుతుందా?

Ad not loaded.

మహేష్ బాబు హీరోగా పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమా మే నెల 12వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. గీతా గోవిందం సినిమా తర్వాత పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన కళావతి సాంగ్ కు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. మహేష్ కెరీర్ లోని బెస్ట్ సాంగ్స్ లో కళావతి సాంగ్ ఒకటిగా నిలిచింది.

Click Here To Watch

సిద్ శ్రీరామ్ తన వాయిస్ తో పాటకు ప్రాణం పోశారనే చెప్పాలి. ప్రస్తుతం సౌత్ ఇండియా సింగర్స్ లో రెమ్యునరేషన్ విషయంలో సిద్ శ్రీరామ్ నంబర్ వన్ పొజిషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. సిద్ శ్రీరామ్ పాడిన పాటలకు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. మ్యూజిక్ లవర్స్ సైతం సిద్ పాట పాడితే ఆ పాట హిట్ అని భావిస్తున్నారు. చిన్న నిర్మాతలు సిద్ కు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసి తమ సినిమాల్లో పాటలు పాడించుకుంటున్నారు.

అయితే భాషాభిమానులు సిద్ శ్రీరామ్ కొన్ని తెలుగు పదాలను స్పష్టంగా పలకడం లేదని కామెంట్లు చేస్తున్నారు. మోగినాయా, కుళ్లబొడిచింది, మరికొన్ని పదాలను సిద్ సరిగ్గా పలకలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. భాషా ప్రియుల బాధను సిద్ శ్రీరామ్ అర్థం చేసుకుని ఇకనైనా జాగ్రత్త పడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కొన్ని పదాలను సిద్ శ్రీరామ్ ఖూనీ చేస్తున్నాడని భాషాభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఈ విషయంలో జాగ్రత్త పడాలని మ్యూజిక్ లవర్స్ కోరుకుంటున్నారు.

సిద్ శ్రీరామ్ ఒక్కో పాటకు 5 లక్షల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. సిద్ శ్రీరామ్ ఈ తప్పులను కూడా సరిదిద్దుకుంటే సింగర్ గా మరింత ఎదిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. స్టార్ హీరోలతో పాటు చిన్న హీరోలు కూడా తమ సినిమాలలో సిద్ శ్రీరామ్ ఒక పాటను పాడేలా చూసుకుంటున్నారు.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus