Prasanth Varma: ప్రశాంత్ వర్మ దగ్గర ఉన్న 33 కథలు కాపీ కథలేనా?

ప్రశాంత్ వర్మ (Prasanth Varma) .. టాలీవుడ్లో ఉన్న యంగ్ డైరెక్టర్స్ లో ఒకరు. ‘అ!’ (Awe) సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్ వర్మ.. ఆ సినిమాతో మంచి విజయాన్నే అందుకున్నాడు. ఆ తర్వాత రాజశేఖర్ (Rajasekhar)తో ‘కల్కి’ చేయగా అది ఫ్లాప్ అయ్యింది. తర్వాత తన స్నేహితుడు తేజ సజ్జతో ‘జాంబీ రెడ్డి’ (Zombie Reddy) చేసి హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చాడు. ఆ వెంటనే ‘హనుమాన్’ (Hanu Man)  మొదలుపెట్టాడు. 3 ఏళ్ళ పాటు టీం అంతా కష్టపడి ఈ సినిమా తీశారు.2024 సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Prasanth Varma

ఇది పాన్ ఇండియా వైడ్ బ్లాక్ బస్టర్ అయ్యింది. పోటీగా రిలీజ్ అయిన మహేష్ బాబు ‘గుంటూరు కారం’ ని కూడా చిత్తు చిత్తు చేసి విన్నర్ గా నిలిచింది. దీంతో ప్రశాంత్ వర్మ పై టాలీవుడ్ నిర్మాతలకి నమ్మకం పెరిగింది. అందుకే ‘జై హనుమాన్’ ని భారీ బడ్జెట్ పెట్టి నిర్మించడానికి ‘మైత్రి’ సంస్థ ముందుకొచ్చింది. ఇదిలా ఉండగా…ప్రశాంత్ వర్మ తన వద్ద ఉన్న కథలని వేరే ప్రొడక్షన్ హౌస్లకి ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇటీవల వచ్చిన ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva)  చిత్రానికి ప్రశాంత్ వర్మ కథ అందించడం జరిగింది.

ఈ సినిమాకి బజ్ రావడానికి, కొద్దిపాటి బిజినెస్ జరగడానికి కారణం ప్రశాంత్ వర్మనే అని చెప్పడంలో సందేహం లేదు. అయితే ‘దేవకీ నందన వాసుదేవ’ చిత్రం దారుణంగా ప్లాప్ అయ్యింది. ఓ హాలీవుడ్ సినిమాని కాపీ కొట్టేసి.. దానికి మైథలాజికల్ టచ్ ఇచ్చేశాడట ప్రశాంత్ వర్మ. ‘వాట్ హ్యపెండ్ టు మండే’ అనే హాలీవుడ్ సినిమాకి ఇది కాపీ అని సినిమా చూసిన వాళ్ళు కామెంట్స్ చేశారు. ‘వాట్ హ్యపెండ్ టు మండే’ కూడా 1915 లో వచ్చిన ‘సెవెన్ సిస్టర్స్’ సినిమా స్ఫూర్తితో రూపొందింది.

పోనీ కాపీ కొట్టడంలో కూడా తప్పేమీ లేదు అనుకునేవారు ఉంటారు. కానీ కాపీ కొట్టిన కథని కరెక్ట్ గా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్టు ఇవ్వాలి కదా. కానీ ప్రశాంత్ వర్మ ఇష్టం వచ్చినట్టు రాసేసి ‘దేవకీ నందన’ దర్సుకుని మొహంపై కొట్టేశాడు. తర్వాత బుర్రా సాయి మాధవ్ ని రంగంలోకి దించినా ఉపయోగం లేకపోయింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇంకో 32 కథలు తన వద్ద ఉన్నట్లు ప్రశాంత్ వర్మ తెలిపాడు. ‘దేవకీ నందన..’ దెబ్బకు వాటిని ఏ దర్శకుడైనా లేదా నిర్మాతైనా తీసుకునే ధైర్యం చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus