దర్శకుడు కృష్ణవంశీ అంత చులకనైపోయాడా..?

కృష్ణవంశీ నుండీ ‘నక్షత్రం’ తర్వాత మరో సినిమా రాలేదు. ‘రంగమార్తాండ’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ప్రకాష్ ఈ మూవీలో ప్రధాన పాత్ర పోషించాడు. శివాత్మిక రాజశేఖర్, అనసూయ,రాహుల్ సిప్లిగంజ్ వంటి వారు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు. దీని గురించి ఎటువంటి అప్డేట్ లేదు ఇప్పటివరకు. అయితే కృష్ణవంశీ మాత్రం కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వస్తున్నారు. ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో తరచూ నెటిజెన్లతో సంభాషిస్తూ ఉంటున్నారు కృష్ణవంశీ.

ఇదిలా ఉండగా.. తాజాగా ఈయన తన ఫేస్బుక్లో ‘స్టివెన్ స్పీల్ బ‌ర్గ్ తీసిన వెస్ట్ సైడ్ స్టోరీస్ సినిమా చూసాను, చాలా బాగా న‌చ్చింది’ అంటూ ఓ పోస్ట్ పెట్టారు. అంతే దీనికి ఓ నెటిజెన్ `నీకు సినిమా తీసి విడుదల చేయడం తప్ప అన్నీ ఇంట్ర‌స్టే..’ అంటూ ఘాటుగా కామెంట్ చేసాడు. ఈ పోస్ట్ పై కృష్ణవంశీ బదులిస్తూ… ‘గాడ్ బ్లెస్ యు’ అంటూ ఓ లవ్ సింబల్ ను అలాగే దణ్ణం పెడుతున్నట్టు ఎమోజీలను జత చేశారు.

ఆయన ఇలాంటి రిప్లై ఇవ్వడం పట్ల అంతా షాకవుతున్నారు. నెటిజెన్లలో చాలా మంది రకాలు ఉంటారు.. అవతలి వ్యక్తి ఎంత ఎలాంటివారైనా ఇలాంటి ఘోరమైన కామెంట్లు పెట్టేవారు అందులో ఒకరు. ఇలాంటి వాళ్ళతో మనకెందుకు అని కృష్ణవంశీ లైట్ తీసుకున్నట్టు స్పష్టమవుతుంది. మరో పక్క ఆ కామెంట్ పెట్టిన నెటిజెన్ ను.. మిగిలిన నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ‘ఆయన ఎలాంటి సినిమాలు మనకి అందించారో తెలుసా?’ ‘మర్యాద పూర్వకంగా ప్రవర్తించడం నేర్చుకో’ అంటూ అతని పై మండి పడుతున్నారు.

1

2

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus