అసలు టీజర్ మీనింగ్ మార్చేస్తున్నారుగా..

అసలు ట్రైలర్లు, టీజర్లు లేని కాలంలో హ్యాపీగా జెమిని చానల్ లో వచ్చే బయోస్కోప్ అనే ప్రోగ్రామ్ లో ప్రోమోస్ వచ్చేవి, ఒక నాలుగైదు రకాల ప్రోమోస్ ను విడుదల చేసి అదే పనిగా ప్లే చేయించేవారు. అవి చూసి జనాలు థియేటర్లకు వెళ్ళేవారు. ఆ తర్వాత ట్రైలర్ల పద్ధతి మొదలైంది. రెండు లేదా మూడు నిమిషాల ట్రైలర్లు విడుదల చేసేవారు. ఆ తర్వాత టీజర్లు మొదలయ్యాయి. ఇలా ఏ పేరు పెట్టినా కూడా వాటి ఫైనల్ గోల్ ఏంటంటే.. జనాలకి సినిమా మీద ఆసక్తి క్రియేట్ చేయడం. అందుకే సినిమా కథాంశం లేదా హీరో క్యారెక్టరైజేషన్ అనేది అర్ధమయ్యేలా సదరు ట్రైలర్ లేదా టీజర్ ను కట్ చేసేవారు.

కానీ.. ఇప్పుడు ఆ టీజర్, ట్రైలర్ ను కట్ చేసే విధానంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ పరిస్థితికి ఆద్యం పోసిన మహానుభావుడు మాత్రం పవన్ కళ్యాణ్. అప్పటివరకూ డైలాగ్స్ లేదా ఏదైనా యాక్షన్ సీక్వెన్స్ ను ట్రైలర్, టీజర్ తో వదిలేవారు. కానీ.. పవన్ కళ్యాణ్ “అత్తారింటికి దారేది” టీజర్ లో మాత్రం పవన్ కళ్యాణ్ అలా పొగమంచులో నుండి సింపుల్ గా నడుచుకుంటూ వస్తుంటాడు. తరువాత ఏమైనా ఉంటుందేమో అని చూస్తుంటే టైటిల్ పడుతుంది. అదే టీజర్ అక్కడ ఏం చెప్పలేదు, జస్ట్ పవన్ కళ్యాణ్ ను చూపించారు అంతే. అయితే.. అది పవర్ స్టార్ కాబట్టి ఆయన నడుచుకుంటూ వచ్చినా టీజర్ సరికొత్త రికార్డులు నెలకొల్పింది. కానీ.. ఈమధ్యకాలంలో చిన్న పెద్ద సినిమా అనే తేడా లేకుండా అందరూ టీజర్ అంటూ ఏవేవో క్లిప్పింగ్స్ వదిళేస్తున్నారు.

అందుకు తాజా ఉదాహరణ “వేరీజ్ వెంకటలక్ష్మి” టీజర్. లక్ష్మీ రాయ్ టైటిల్ పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రం టీజర్ ఇవాళ విడుదలైంది. 30 సెకన్ల టీజర్ లో లక్ష్మీరాయ్ నాభి, వీపు చూపించడం తప్ప ఏమీ చెప్పలేదు. ఈ సినిమా ఆల్రెడీ ఆమె గ్లామర్ ప్రధానాంశంగా రూపొందుతుందని పోస్టర్ల ద్వారా తెలియజేశారు. ఇప్పుడు మళ్ళీ వాటినే చూపిస్తూ టీజర్ ఎందుకో అర్ధం కాలేదు. చిన్న సినిమా కాబట్టి అటెన్షన్ గ్రాబ్ చేయాలంటే లక్ష్మీరాయ్ ను మాత్రమే చూపిస్తే సరిపోదు.. ఎందుకంటే ఆమె తన మునుపటి చిత్రాల్లో అంతకంటే ఎక్కువగానే ఎక్స్ ఫోజ్ చేసింది. సో, కనీసం ట్రైలర్ లో అయినా లక్ష్మీరాయ్ ను కాక కాన్సెప్ట్ మీద కాన్సన్ ట్రేట్ చేస్తే బెటర్. లేదంటే మాత్రం సినిమా విడుదలైన విషయం కూడా ఎవరికీ తెలియకుండాపోతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus