Prabhas: ‘రాధే శ్యామ్’ విషయంలో నార్త్ ఆడియెన్స్ అసహనం..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాధే శ్యామ్’ చిత్రం 2022 జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం తెలిపింది. ‘గోపికృష్ణా మూవీస్’ సంస్థతో కలిసి యూవీ క్రియేషన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ తెలుగు వెర్షన్ కు సంగీతం అందించాడు.పాన్ ఇండియా చిత్రం కావడంతో హిందీ వెర్షన్ కు మిథున్, అమాల్ మాలిక్, మనన్ భరద్వాజ్ లను ఎంపిక చేసుకున్నారు.

సుమారు రూ.280కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘ఆర్.ఆర్.ఆర్’ కంటే ఓ నెల ముందే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అయ్యింది. ‘సాహో’ ఫలితంతో మొదట ఈ చిత్రం పై పెద్దగా అంచనాలు లేవు. అయితే ఈ మధ్యనే విడుదలైన విక్రమాదిత్య టీజర్ సినిమా పై అంచనాలు భారీగా పెరిగేలా చేసింది. ఆ తర్వాత విడుదలైన పాటలు కూడా సూపర్ హిట్ అవ్వడంతో రోజు రోజుకీ ‘రాధే శ్యామ్’ పై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి.

రేపు రామోజీ ఫిలిం సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ఏర్పాటు చేశారు. ట్రైలర్ కూడా రేపే విడుదల కానుంది. అయితే మిగిలిన భాషల్లో సినిమా ప్రమోషన్లను ఇంకా మొదలుపెట్టలేదు చిత్ర యూనిట్ సభ్యులు. ‘సాహో’ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ నమోదవ్వడానికి కారణం నెల రోజుల ముందు నుండీ చేసిన ప్రమోషన్లే. కానీ ‘రాధే శ్యామ్’ విషయంలో అలా జరగడం లేదు. ప్రభాస్ సన్నిహితుల్ని అడిగితే.. ‘రైట్ టైములో సినిమా వస్తుంది.

భారీ హిట్టు కొడుతుంది. టెన్షన్ పడాల్సిన పనే లేదు. రాసిపెట్టుకోండి.ట్రైలర్ రిలీజ్ అయ్యాక మీరే చూడండి’ అంటున్నారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏమో తెలీదు కానీ మరో పక్క బాలీవుడ్లో ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ‘రాధే శ్యామ్’ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus