దొంగ కలెక్షన్లు ఎందుకు చెబుతున్నారు.. స్టార్‌ హీరోయిన్‌ సినిమాపై సంచలన కామెంట్స్‌.!

బాలీవుడ్‌, టాలీవుడ్.. ఇలా ఏ వుడ్‌ అయినా ఇప్పుడు హాట్ టాపిక్‌గా వినిపిస్తున్న అంశం ‘కలెక్షన్లు’. అవును సినిమాల వసూళ్ల గురించి చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. మన దగ్గర ఆ చర్చ జరగడానికి కారణం ప్రముఖ నిర్మాత నాగవంశీ కామెంట్స్‌ కాగా.. బాలీవుడ్‌లో అయితే ప్రముఖ కథానాయిక ఆలియా భట్‌ (Alia Bhatt) సినిమా. అవును అలియా, వేదాంగ్‌ రైనా ప్రధాన పాత్రల్లో నటించిన ‘జిగ్రా’నే కారణం. దసరా కానుకగా శుక్రవారం విడుదలైన ఈ సినిమా విషయంలో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.

Star Heroine

సినిమా ఆశించిన స్థాయిలో లేదు అనే హార్స్‌ కామెంట్స్‌ కూడా వచ్చాయి. అయితే సినిమా టీమ్‌ మాత్రం అదిరిపోయే వసూళ్లు వస్తున్నాయి అంటోంది. ఆ లెక్కన వసూళ్లు కరెక్టే అని చెప్పే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఈ విషయంలో ప్రముఖ నటి, టీ సిరీస్‌ నిర్మాత భూషణ్‌ కుమార్‌ సతీమణి దివ్య ఖోస్లా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. థియేటర్లు ఖాళీగా ఉన్నప్పటికీ ఫేక్‌ కలెక్షన్స్‌ ఎలా ప్రకటిస్తున్నారంటూ దివ్య ఖోస్లా నేరుగా సినిమా పేరు చెబుతూ మండిపడింది.

‘జిగ్రా’ సినిమా చూడటానికి థియేటర్‌కు వెళ్లాను. లోపల చూస్తే అంతా ఖాళీ. ఇక్కడే కాదు చాలా చోట్లా ఇదే పరిస్థితి. సినిమా వాళ్లే టికెట్లు కొనుగోలు చేసి ఫేక్‌ కలెక్షన్స్‌ అనౌన్స్‌ చేస్తున్నట్లున్నారు. ఇలా చేస్తున్నందుకు అలియా భట్‌ (Star Heroine) ధైర్యాన్ని మెచ్చుకోవాలి అని దివ్య కామెంట్‌ చేసింది.ఏదేమైనా సినిమా వసూళ్ల విషయంలో ప్రేక్షకులను వెర్రివాళ్లను చేయకూడదు అని కూడా దివ్య ఖోస్లా అంది. ఈ కామెంట్లు వైరల్‌ అవుతున్న సమయంలోనే నిర్మాత కరణ్‌ జోహార్‌ ఓ పోస్ట్‌ పెట్టారు.

‘‘మూర్ఖులకు మనం ఇచ్చే అత్యుత్తమ సమాధానం మౌనమే’’ అని ఓ కోట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. దివ్య ఖోస్లా వ్యాఖ్యలపైనే కరణ్ పరోక్షంగా అలా స్పందించారని తెలుస్తోంది.వాసన్‌ బాలా దర్శకత్వం వహించిన ‘జిగ్రా’లో తన తమ్ముడి కోసం అక్క చేసే పోరాటం చూపించారు. అయితే ఈ సినిమా దివ్య ఖోస్లా నటించిన ‘సవి’కి దగ్గరగా ఉందనే విమర్శలూ ఉన్నాయి. ఇప్పుడు ఆమె రియాక్ట్‌ అవ్వడం గమనార్హం.

రూ.2000 కోట్లు వస్తాయంటున్న ప్రముఖ నిర్మాత.. మరీ ఓవర్‌గా లేదా అంటూ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus