KE Gnanavel Raja: రూ.2000 కోట్లు వస్తాయంటున్న ప్రముఖ నిర్మాత.. మరీ ఓవర్‌గా లేదా అంటూ..!

మొన్నీమధ్య వచ్చిన ‘కంగువ’ (Kanguva) సినిమా టీజర్‌ చూశారా? చూసే ఉంటారు లెండి ఆ రేంజిలో ప్రమోషన్స్‌ చేశారు కదా. ఆ సినిమా విజయం అందుకుంటుందా అంటే అవును అని చెప్పొచ్చు. అయితే ఆ సినిమాకు రూ. 2000 కోట్లు వస్తాయా అని అడిగితే ఏం చెబుతారు. కచ్చితంగా ‘రూ.2000 కోట్లా.. అసలు సాద్యమేనా?’ అనే ప్రశ్న వేస్తారు. అయితే ఈ ప్రశ్న వేయాల్సింది ఆ సినిమా నిర్మాత కేఈ జ్ఞానవేల్‌కి (K. E. Gnanavel Raja). అవును ఆయనే ఆ మాట అన్నది.

KE Gnanavel Raja

సూర్య హీరోగా శివ తెరకెక్కిస్తున్న ‘కంగువ’ సినిమా వసూళ్ల విషయంలో నిర్మాత కేఈ జ్ఞానవేల్‌ (KE Gnanavel Raja) ధీమా వ్యక్తం చేశారు. బాక్సాఫీసు దగ్గర మా సినిమా రూ.2000 కోట్ల వసూళ్లు అందుకుంటుంది అని నమ్మకంగా చెబుతున్నారు. దర్శకుడు శివతో కలసి ఓ యూట్యూట్‌ ఛానల్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జ్ఞానవేల్‌ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘కంగువ’ సినిమా రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరుతుందా అని అడిగితే.. వెయ్యేంటి రెండు వేల కోట్ల క్లబ్‌లో చేరుతుంది అని చెప్పారు.

దీంతో ‘ఏంటీ రెండు వేల కోట్ల రూపాయాలా? అంత నమ్మకం ఏంటి? అతి నమ్మకమేంటి’ అనే ప్రశ్న మొదలైంది. ఎందుకంటే మన దగ్గర ఎంత భారీ విజయం సాధించిన సినిమా అయినా, అందులో సౌత్‌ సినిమా అయినా అంత భారీ వసూళ్లు అందుకోలేదు. కనీసం రూ. 1500 కోట్ల వరకు కూడా రాలేదు. ఒకవేళ అంతగా రావాలంటే మొత్తంగా దేశవ్యాప్తంగా సినిమాకు భారీ స్థాయిలో వసూళ్లు రావాలి. విదేశాల్లో కూడా భారీ ఆదరణ దక్కాలి.

అయితే ‘కంగువ’ విషయంలో కాపీ, ఇన్‌స్పిరేషన్‌ రూమర్లు గట్టిగా వస్తున్నాయి. అలాంటి సినిమాతో రూ.2000 కోట్లు అంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఒకవేళ వస్తే కనక పాన్‌ ఇండియా హీరోల్లో సూర్యను మించిన వారు ఉండరు అని చెబుతున్నారు. చూద్దాం మరి జ్ఞానవేల్‌ మాటలు ఎంతవరకు నిజమవుతాయో నవంబరు 14న తేలిపోతుంది. ఆరోజే ‘కంగువ’ ఆగమనం.

యుధ పూజ సాంగ్ షూట్ లో అందరికీ షాక్ ఇచ్చిన తారక్.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus