నాచురల్ స్టార్ నాని కూడా మొదటి సారి సినిమా జీవితంలో అత్యధిక భారీ బడ్జెట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శ్యామ్ సింగరాయ్ సినిమా ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సాయి పల్లవి, కృతి శెట్టి కథానాయకులుగా నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. తప్పకుండా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుంది అని చిత్ర యూనిట్ సభ్యులు కూడా నమ్మకంతో ఉన్నారు.
అంతే కాకుండా నాని మార్కెట్ లిమిట్ ను దాటి భారీగా పెట్టుబడులు పెట్టారు. ఇక సినిమా విడుదలకు ముందే 20 కోట్లకు పైగా లాభాలను అందించడం విశేషం. నాని జీవితంలో మొట్టమొదటిసారి నాన్ థియేట్రికల్ గా భారీ స్థాయిలో బిజినెస్ చేసిన చిత్రంగా శ్యామ్ సింగరాయ్ నిలిచింది. హిందీ డబ్బింగ్ రైట్స్ లో సినిమా పది కోట్లకు అమ్ముడవ్వగా శాటిలైట్ హక్కులను జెమినీ టీవీ 10 కోట్లకు దక్కించుకుంది.
ఇక సినిమా విడుదలకు ముందే ఈ స్థాయిలో లాభాలు అందించింది అంటే విడుదల తర్వాత ఇంకా ఏ స్థాయిలో ప్రాఫిట్ సాధిస్తుందో అని ప్రేక్షకుల్లో పాజిటివ్ అంచనాలను క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన టీజర్ పోస్టర్స్ తో పాటు పాటలు కూడా మంచి హైప్ ఐతే క్రియేట్ చేశాయి. ఇక సినిమాను దాదాపు 45 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మించినట్లు తెలుస్తోంది. ఇక నాని సినిమా కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా సక్సెస్ అవ్వాలంటే దాదాపు యాభై కోట్ల వరకు రాబడితేనే పెట్టిన పెట్టుబడికి అర్థం ఉంటుంది.
సినిమాలో చివరగా సిరివెన్నెల సీతారామశాస్త్రి రెండు పాటలు రాసిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల విడుదలైన సిరివెన్నెల పాట కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక వీలైనంత త్వరగా చిత్ర యూనిట్ సభ్యులు కూడా రెగ్యులర్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లను అందుకుంటుందో చూడాలి.
Most Recommended Video
‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!