మెగా మేనల్లుడు సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ‘ఉప్పెన’ పేరుతో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేసాడు. ఈ చిత్రాన్ని మొదట 2020 ఏప్రిల్‌లోనే విడుదల చెయ్యాలి అని అనుకున్నారు. కానీ కరోనా కారణంగా థియేటర్లు మూతపడటంతో అది సాధ్యపడలేదు. ఆ టైములో ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చెయ్యమని బోలెడన్ని ఆఫర్స్ నిర్మాతలను వెతుక్కుంటూ వచ్చాయి.
కానీ ‘ఉప్పెన’ కు వాళ్ళు 25 కోట్ల వరకూ బడ్జెట్ పెట్టేసారు. ఇందులో ఓటిటి నుండీ 13కోట్ల వరకూ ఆఫర్ వస్తుంది. ఇక శాటిలైట్ రైట్స్ రూపంలో 5కోట్ల నుండీ 6కోట్ల వరకూ ఆఫర్ వస్తుందట. దీంతో ఎంత కాదనుకున్నా 6కోట్ల నుండీ 7కోట్ల వరకూ నష్టం వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో థియేట్రికల్ రిలీజ్ ఇస్తే కనీసం 8కోట్ల నుండీ 10కోట్ల వరకూ వసూల్ అవుతుందని నిర్మాతలు భావించి వెయిట్ చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ‘ఉప్పెన’ ను కనుక సంక్రాంతి కానుకగా విడుదల చేసి ఉంటే.. కచ్చితంగా మంచి వసూళ్లను సాధించి ఉండేది.
కానీ దర్శకనిర్మాతలు ఆ దిశగా ప్రయత్నాలు చెయ్యలేదు. ఈ చిత్రాన్ని నేరుగా నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిలింనగర్లో గుస గుసలు వినిపిస్తున్నాయి. దానికి వారం రోజుల ముందు థియేట్రికల్ రిలీజ్ ఉంటుందట. సాధారణంగా ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యే సినిమాలకు పెద్దగా కలెక్షన్లు రావు. అలాంటిది మరి వైష్ణవ్ తేజ్ సినిమాకి వస్తాయా..? అంటే నిర్మాతల రిస్కీ డెసిషన్ అనే చెప్పాలి.
Most Recommended Video
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!