Karthikeya 2: కార్తికేయ2 హిందీలో ఆ మార్కును అందుకుంటుందా?

నిఖిల్ హీరోగా అనుపమ ప్రధాన పాత్రలో చందూ మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కిన కార్తికేయ2 ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా ఊహించని స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. నార్త్ లో ఈ సినిమాకు థియేటర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. పుష్ప ది రైజ్ సినిమాకు కార్తికేయ2 సినిమాకు కొన్ని విషయాలకు సంబంధించి పోలికలు ఉన్నాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మొదట కార్తికేయ2 సినిమాకు హిందీలో పరిమితంగా థియేటర్లు దక్కాయి.

అయితే లాల్ సింగ్ చడ్డా, రక్షా బంధన్ సినిమాలతో పోలిస్తే కార్తికేయ2 సినిమాకు బెటర్ టాక్ రావడంతో ఈ సినిమాకు కలెక్షన్లు పెరగడంతో పాటు థియేటర్ల సంఖ్య కూడా పెరుగుతోంది. కేవలం హిందీలోనే ఈ సినిమా ఫుల్ రన్ లో 15 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ పిక్చర్స్ నిర్మాతలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. పుష్ప ది రైజ్ సినిమా కూడా మొదట ఏ మాత్రం అంచనాలు లేకుండా బాలీవుడ్ లో విడుదలైంది.

ఆ తర్వాత మౌత్ టాక్ పాజిటివ్ గా స్ప్రెడ్ కావడంతో ఈ సినిమా ఏకంగా 100 కోట్ల రూపాయలకు పైగా హిందీలో గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుని వార్తల్లో నిలిచింది. పుష్ప ది రైజ్ బాలీవుడ్ లో చేసిన మ్యాజిక్ ను కార్తికేయ2 రిపీట్ చేయడం గమనార్హం. దర్శకుడు చందూ మొండేటి ఈ సినిమాతో ప్రశంసలు అందుకుంటున్నారు.

సరికొత్త కథ, కథనంతో కార్తికేయ2 సినిమాను తెరకెక్కించడంతో చందూ మొండేటికి ఆఫర్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. పరిమిత బడ్జెట్ లోనే అద్భుతాలు చేసిన చందూ మొండేటి భారీ బడ్జెట్ తో సినిమాలను నిర్మించే నిర్మాతలు దొరికితే స్టార్ హీరోలతో సినిమాలను తెరకెక్కించి అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటారనడంలో సందేహం అవసరం లేదని చెప్పవచ్చు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus