నిన్న బుట్ట బొమ్మ సాంగ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది యంగ్ హీరోయిన్ స్వాతి దీక్షిత్. ఒక ప్రక్క ఐపీఎల్, సరైన కంటెస్టెంట్స్ లేరనే నిరాశ బిగ్ బాస్ పై ప్రేక్షకులకు ఆసక్తి కలిగించ లేకపోతోంది. ప్రారంభ ఎపిసోడ్ మినహాయిస్తే ఆ తరువాత బిగ్ బాస్ కి వస్తున్న టీఆర్పీ చాలా తక్కువగా ఉంది. దీనితో బిగ్ బాస్ నిర్వాహకులు వరుసగా వైల్డ్ కార్డు ఎంట్రీలను ప్రవేశపెడుతున్నారు.
మొదటిగా కుమార్ సాయి, ఆ తరువాత జబర్దస్త్ ఫేమ్ ముక్కు అవినాష్ బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక స్వాతి దీక్షిత్ మూడవ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి ప్రవేశించారు. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయితే చాలు ఆమె ఎవరు, పూర్వపరాలేమిటని తెలుసుకోవాడనికి అందరూ ప్రయత్నం చేస్తారు. బెంగాలీ అమ్మాయి అయిన స్వాతి దీక్షిత్ 2012లో వచ్చిన తోర్ నామ్ అనే చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు.
ఆ తరువాత వరుసగా నాలుగు తెలుగు సినిమాలలో నటించింది. 2014లో వచ్చిన జంప్ జిలాని మూవీలో స్వాతి దీక్షిత్ హీరోయిన్ గా నటించారు. ఐతే స్వాతి 2018 బ్లాక్ బస్టర్ ఆర్ ఎక్స్ 100మూవీలో హీరోయిన్ గా ఎంపికయ్యారు. వారం రోజుల షూటింగ్ తరువాత ఆమెను కొన్ని కారణాల వలన తొలగించడం జరిగింది. అలా టాలీవుడ్ లో నిలదొక్కుకునే అవకాశం స్వాతి దీక్షిత్ కోల్పోయింది.