ఇండస్ట్రీ హిట్ అత్తారింటికి దారేదికి వెనుక ఆసక్తికర సంగతులు

గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పవన్ తన తదుపరి చిత్రం దర్శకుడు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో కెమెరామెన్ గంగతో రాంబాబు అనే పొలిటిక్ ఎంటర్టైనర్ చేశారు. ఈ మూవీ మిక్స్డ్ రిజల్ట్ అందుకుంది. ఆ తరువాత పవన్ దర్శకుడు త్రివిక్రమ్ తో రెండవ చిత్రంగా అత్తారింటికి దారేది మూవీకి సైన్ చేయడం జరిగింది. జల్సా మూవీ కోసం మొదటిసారి కలిసి పనిచేసిన త్రివిక్రమ్ మరియు పవన్ మంచి మిత్రులు అయ్యారు. దీనితో ఓ ఎమోషన్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ డ్రామా అత్తారింటి దారేది చిత్రం కోసం ఇద్దరూ చేతులు కలిపారు.

మరి కొద్దిరోజులలో మూవీ విడుదల అనగా సగానికి పైగా సినిమా పుటేజ్ బయటికి వచ్చింది. అత్తారింటికి దారేది మూవీ విడుదల ముందే సగానికి పైగా మూవీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఊహించని పరిణామంతో చిత్ర యూనిట్ నష్టనివారణ చర్యలు చేపట్టారు. పైరసీ వీడియోని అన్ని సైట్స్ నుండి డిలీట్ చేశారు. ఎడిటింగ్ రూమ్ నుండి వీడియో లీక్ అయ్యిందని తెలుసుకున్న నిర్మాతలు ద్రోషులను పట్టుకున్నారు. ఐతే ఈ పరిణామం మూవీకి నష్టం చేకుర్చగపోగా మేలు చేసింది. లీకైన అత్తారింటికి దారేది పైరసీ వీడియో ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. దీనితో మూవీపై పాజిటివ్ బజ్ ఏర్పడింది.

అత్తారింటికి దారేది చిత్రానికి భారీ ఓపెనింగ్స్ దక్కాయి. అలా ప్రమాదం సినిమాకు ప్రయోజనం చేకూర్చింది. యాక్షన్, రొమాన్స్ అన్నింటికీ మించి ఫ్యామిలీ ఎమోషన్స్ తో త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. సమంత, ప్రణీత గ్లామర్ మరియు దేవి శ్రీ సాంగ్స్ మూవీ విజయంలో కీలక పాత్ర పోషించాయి. నదియా, బోమన్ ఇరాని, రావు రమేష్, పోసాని నటన ఈ చిత్రంలో హైలెట్ అని చెప్పాలి. అంతా ఒకెత్తయితే బ్రహ్మనందం కామెడీ మరో ఎత్తు. ఇండస్ట్రీ హిట్ కొట్టిన అత్తారింటికి దారేది మూవీ విడుదలైన నేటికి సరిగ్గా 7ఏళ్ళు. 2013 సెప్టెంబర్ 27న అత్తారింటికి దారేది విడుదల అయ్యింది.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus