Devara: తారక్ లుక్ ను కొరటాల సీరియస్ గా చూపించడానికి అసలు కారణమిదా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్30 మూవీకి దేవర అనే టైటిల్ ఫిక్స్ అయిందనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. బ్లాక్ డ్రెస్ లో ఎన్టీఆర్ కనిపించగా తారక్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపిస్తారని తెలుస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన లుక్ తండ్రి లుక్ అని సమాచారం. ఈ దేవర రికార్డులు తిరగరాసేలా ఉన్నాడని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

ఈ సినిమాలో తారక్ రెండు పాత్రలు పోషించినా రెండు పాత్రలు సీరియస్ గానే ఉంటాయని తెలుస్తోంది. ఆ రీజన్ వల్లే కొరటాల శివ తారక్ లుక్ ను సీరియస్ గా చూపించారని సమాచారం. 2024 సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ భావించినా మేకర్స్ మాత్రం ఫస్ట్ లుక్ తోనే సరిపెట్టారని చెప్పాలి.

అనిరుధ్ (Devara) ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పులు లేవని తెలుస్తోంది. ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం. జూనియర్ ఎన్టీఆర్ తన పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి గ్రాండ్ గా జరుపుకుంటున్నారని సమాచారం అందుతోంది. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు తారక్ హాజరు కావడం లేదని సమాచారం.

ఈ వేడుకకు తారక్ హాజరై ఉంటే బాబాయ్ అబ్బాయ్ కాంబినేషన్ ను చూసేవాళ్లమని కామెంట్లు వినిపిస్తున్నాయి. హై వోల్టేజ్ క్యారెక్టర్ లో తారక్ నటిస్తుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. దేవర టైటిల్ తారక్ అభిమానులకు నచ్చింది. కొరటాల శివ పవర్ ఫుల్ టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus