Mokshagna: భగవంత్ కేసరిలో మోక్షజ్ఞ కనిపిస్తారా.. ఆ పాత్రలో మెప్పిస్తారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కి థియేటర్లలో విడుదలవుతున్న సినిమాలలో భగవంత్ కేసరి ఒకటి కాగా ఈ సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే భగవంత్ కేసరి సెట్స్ లో, భగవంత్ కేసరి ప్రమోషన్స్ లో మోక్షజ్ఞ కనిపిస్తుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. అదే సమయంలో ఈ సినిమాలో కథను మలుపు తిప్పే పాత్రలో మోక్షజ్ఞ నటించారంటూ వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. మరి మోక్షజ్ఞ ఈ సినిమాలో నిజంగా కనిపిస్తారో లేదో తెలియాలంటే మాత్రం మరి కొన్నిరోజులు ఆగాల్సిందే.

బాలయ్య ఈ సినిమాలో మరో పవర్ ఫుల్ రోల్ లో కనిపిస్తారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే వైరల్ అవుతున్న ఆ వార్తలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. బాలయ్య మోక్షజ్ఞలను (Mokshagna) ఒకే ఫ్రేమ్ లో చూడాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు. భగవంత్ కేసరి సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని తెలుస్తోంది. బాలయ్య ఫ్లాష్ బ్యాక్ కు సంబంధించిన సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయని ప్రచారం జరుగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పుడు మొదలవుతాయో తెలియాల్సి ఉంది. బాలయ్య ఈ సినిమాతో మరో సక్సెస్ ను సొంతం చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. భగవంత్ కేసరి సక్సెస్ సాధిస్తే బాలయ్య రెమ్యునరేషన్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. బాలయ్య, శ్రీలీల కాంబినేషన్ లో ఎమోషనల్ సీన్స్ ఉండనున్నాయని తెలుస్తోంది.

షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమా కమర్షియల్ గా ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందో చూడాలి. శ్రీలీల అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే రోల్ లో ఈ సినిమాలో కనిపిస్తారని తెలుస్తోంది. భగవంత్ కేసరి సక్సెస్ కాజల్, శ్రీలీలలకు ఎంతో కీలకం కానుందని సమాచారం అందుతోంది. భగవంత్ కేసరి సినిమా రికార్డ్ స్థాయి స్క్రీన్లలో రిలీజ్ కానుందని తెలుస్తోంది.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus