నాగార్జున హీరోయిన్ గురించి ఊహించని నిజాలు..!

‘కింగ్’ నాగార్జున హీరోగా మణిరత్నం డైరెక్షన్లో వచ్చిన ‘గీతాంజలి’ చిత్రాన్ని ఎప్పటికీ మరచిపోలేము అనడంలో అతిశయోక్తి లేదు. ఈ చిత్రం ఓ క్లాసిక్.. ఇప్పటి యూత్ కూడా ఈ చిత్రాన్ని ఎంతో ఆసక్తితో చూస్తుంటారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గిరిజ నటన కూడా అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటుంది. అయితే ఈమె గురించి ఓ సీనియర్ జర్నలిస్ట్ ఆసక్తి కరమైన విషయాల్ని చెప్పుకొచ్చాడు. ఈ విషయాలు విన్న తరువాత ఎవరైనా షాక్ కి గురవ్వాల్సిందే.

ఆ సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడుతూ.. ” ‘గీతాంజలి’ సినిమాతో హీరోయిన్ గిరిజకి స్టార్ డమ్ వచ్చేసింది. ఆ సమయంలోనే ఆమె మా సినిమా ‘హృదయాంజలి’ లో కూడా చేశారు. అయితే ఆమెకు వచ్చిన స్టార్ డమ్ ను ఎంతమాత్రం పట్టించుకునేది కాదు. తన ఇంటి నుండీ ఆమె మా ఆఫీస్ కు సైకిల్ పై వచ్చేది. ఆ క్రమంలో ‘గీతాంజలి’ గిరిజ అంటూ చాలామంది ఆమెను ఫాలో అవుతూ ఉండేవారు. అది చూసి ‘అలా సైకిల్ పై తిరగవద్దని’ మేము చెప్పాము. ఒక రోజున ఆమె మా ఇంటి అడ్రెస్ అడిగితే ఇచ్చాను .. మరునాడు ఉదయమే ఆమె మా ఇంటికి వచ్చేశారు. అప్పట్లో మాది చాలా ఇరుకైన ఇల్లు .. అయినా అందరినీ పరిచయం చేసి ఆమెకి అతిథి మర్యాదలు చేశాను. ‘గీతాంజలి’ గిరిజ మా ఇంటికి వచ్చిందని తెలిసి కాలనీలోని వాళ్ళంతా రావడం మొదలుపెట్టారు. గుంపులుగా జనం పెరిగిపోతూ ఉండటంతో, నాలో టెన్షన్ పెరిగింది. వెంటనే.. ఆటో మాట్లాడేసి ఆమెను పంపించేసరికి నా తల ప్రాణం తోకకి వచ్చింది” అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.

1

2

3

అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus