Nani,Jeetu Josesph: నాని జీతూ జోసెఫ్ కాంబో మూవీ అలా ఉండనుందా?

న్యాచురల్ స్టార్ నాని అంటే సుందరానికి, దసరా సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకున్నారు. ఈ రెండు సినిమాలు మంచి ఫలితాలను సొంతం చేసుకున్నాయి. నాని ప్రస్తుతం ఒక సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. నాని హిట్2 సీక్వెల్ లో కూడా నటిస్తానని ప్రకటన చేయగా ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్న నాని దృశ్యం డైరెక్టర్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించనున్నారని తెలుస్తోంది.

దృశ్యం, దృశ్యం2 సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న డైరెక్టర్లలో జీతూ జోసెఫ్ ఒకరు. జీతూ జోసెఫ్ కు తెలుగు ప్రేక్షకుల్లో సైతం మంచి పాపులారిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నాని రెమ్యునరేషన్ ప్రస్తుతం భారీ రేంజ్ లో ఉంది. ఒక్కో సినిమాకు నాని రెమ్యునరేషన్ 25 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. దృశ్యం టైప్ తరహా కథాంశంతోనే ఈ సినిమా తెరకెక్కుతుందని సమాచారం అందుతోంది.

నాని (Nani) రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు సైతం భావిస్తున్నారు. దసరా మూవీ పాన్ ఇండియా మూవీగా థియేటర్లలో విడుదలైనా అన్ని వర్గాల ప్రేక్షకుల అంచనాలను ఈ సినిమా అందుకోలేదు. నాని కెరీర్ పరంగా మరింత ఎదగాలంటే స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో మరింత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

స్వయంకృషితో నాని సంచలన విజయాలను సొంతం చేసుకున్న సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. నాని వయస్సు పెరుగుతున్నా అదే విధంగా సక్సెస్ రేట్ ను సైతం పెంచుకుంటున్నారు. నాని కథ నచ్చితే మల్టీస్టారర్ సినిమాలలో నటించడానికి కూడా ఆసక్తిగా ఉన్నారని సమాచారం అందుతోంది. రాబోయే రోజుల్లో నాని కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాలి. టైర్2 హీరోలలో నాని నంబర్ వన్ హీరోగా ఉన్నారు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus