Rajamouli: జక్కన్న ఫోకస్ వెనుక అసలు రీజన్ ఇదా.. వాళ్లు ఫాలో అవుతారా?

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది దర్శకులు ఒక హిట్ సినిమాను తెరకెక్కించడానికే ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. రేయింబవళ్లు కష్టపడి కథ, కథనంపై దృష్టి పెట్టి అన్ని విభాగాల విషయంలో జాగ్రత్తలు తీసుకుని బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తే మాత్రం సూపర్ హిట్లు సాధించడం సాధ్యమవుతుంది. అయితే రాజమౌళి మాత్రం సక్సెస్ సాధించడానికి కష్టాన్నే నమ్ముకున్నారు. తన కష్టంతో ఈ స్థాయికి చేరుకున్నారు. అయితే రాజమౌళి ఈ స్థాయికి చేరుకోవడంలో కీలక పాత్ర పోషించింది ఆయన భయం అని సమాచారం.

ఊహల్లో సీన్ ను క్రియేట్ చేసే జక్కన్న తన ఊహలను సినిమా సీన్ల రూపంలో మార్చడానికి ఎంతో కష్టపడతారు. క్వాలిటీ విషయంలో రాజమౌళి అస్సలు రాజీ పడరు. పని రాక్షసుడు అని, అమరశిల్పి జక్కన్నలా రాజమౌళి సినిమాలను చెక్కుతారని కొంతమంది కామెంట్లు చేసినా ఆ కామెంట్లను రాజమౌళి పాజిటివ్ గా తీసుకుంటారు. కాన్ఫిడెన్స్ కంటే భయం ఎక్కువగా ఉన్న జక్కన్న ప్రతి సీన్ విషయంలో ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకుని సినిమా తీయడం వల్ల విజయాలు దక్కుతున్నాయి.

రాజమౌళి ఒక సందర్భంలో ఈ విషయాలను చెప్పుకొచ్చారు. అదే సమయంలో రాజమౌళి సినిమాలలోని సీన్లకు సంబంధించి తన కుటుంబ సభ్యుల సలహాలు తీసుకుంటారు. వాళ్ల అభిప్రాయాలు నిజమేనని అనిపిస్తే ఆ అభిప్రాయాలకు అనుగుణంగా బెటర్ ఔట్ పుట్ కోసం మరింత కష్టపడతారు. రాజమౌళి సినిమాను ఎక్కువ కాలం పాటు షూట్ చేసినా నిర్మాతలకు లాభాలు వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటారు.

రాజమౌళితో (Rajamouli) సినిమా తీసిన ప్రతి నిర్మాత కలెక్షన్ల విషయంలో సంతృప్తితో ఉన్నారు. జక్కన్న సినిమాలు రాబోయే రోజుల్లో 1000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంతో తెరకెక్కుతున్నాయి. మహేష్ జక్కన్న కాంబో మూవీకి సంబంధించి అధికారికంగా త్వరలో మరిన్ని క్రేజీ అప్ డేట్స్ వచ్చే అవకాశం ఉంది. జక్కన్న భవిష్యత్తు సినిమాలు సంచలనాలు సృష్టిస్తాయేమో చూడాలి. ఇతర డైరెక్టర్లు జక్కన్నను ఫాలో అవుతారేమో చూడాల్సి ఉంది.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus