Ravi Teja: రవితేజ కొత్త మూవీ గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

మాస్ మహారాజ్ రవితేజ సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో క్రాక్ మూవీ ఒకటనే సంగతి తెలిసిందే. రవితేజ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ఆమెకు కూడా ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కగా ఆ సీన్స్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చాయి.

రవితేజ గోపీచంద్ మలినేని కాంబోలో మరో సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాకు క్రాక్ సెంటిమెంట్ రిపీట్ అవుతోందని తెలుస్తోంది. ఈ కాంబినేషన్ లో ఇది నాలుగో మూవీ కాగా వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది. గోపీచంద్ మలినేని వరుస విజయాలతో జోరుమీదుండగా భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో ఆయన మరిన్ని విజయాలను అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

రవితేజ కెరీర్ కు ప్రస్తుత పరిస్థితుల్లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవసరం అనే సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఆ లోటు భర్తీ కానుందని తెలుస్తోంది. స్టార్ హీరోయిన్ ఈ సినిమాలో రవితేజకు జోడీగా నటించే ఛాన్స్ అయితే ఉందని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. రవితేజ పారితోషికం ప్రస్తుతం 25 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.

రవితేజకు (Ravi Teja) జోడీగా చాలామంది హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తుండగా ఏ హీరోయిన్ ఫైనల్ అవుతారో చూడాల్సి ఉంది. మాస్ మహారాజ్ రవితేజ పాన్ ఇండియా హిట్లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. రవితేజ కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉందో చూడాల్సి ఉంది. మాస్ మహారాజ్ రవితేజను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య మాత్రం ఊహించని స్థాయిలో పెరుగుతుండటం గమనార్హం. కథ నచ్చితే రవితేజ మల్టీస్టారర్ సినిమాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus