Suhas: సుహాస్ పెళ్లి వెనుక ఇన్ని ట్విస్టులా.. పారితోషికం ఎంతంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాలెంటెడ్ నటులలో సుహాస్ ఒకరు కాగా సినిమా సినిమాకు సుహాస్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది. కలర్ ఫోటో, హిట్2, రైటర్ పద్మభూషణ్ సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకున్న సుహాస్ సినిమా సినిమాకు రేంజ్ ను పెంచుకుంటున్నారు. అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాతో సుహాస్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాతో సుహాస్ ఖాతాలో మరో సక్సెస్ చేరనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ లాంఛ్ ఈవెంట్ లో భాగంగా సుహాస్ మాట్లాడుతూ అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాలో బన్నీ ఫ్యాన్ గా కనిపిస్తానని చెప్పుకొచ్చారు.

ఆర్య మూవీ రిలీజైన సమయం నుంచి డాన్స్ నేర్చుకోవాలని తాను కూడా గట్టిగా ప్రయత్నించానని సుహాస్ తెలిపారు. కొరియోగ్రాఫర్ ను అవ్వాలని సినిమా ఇండస్ట్రీకి వచ్చానని సుహాస్ కామెంట్లు చేయడం గమనార్హం. సుహాస్ తన రెమ్యునరేషన్ గురించి వస్తున్న వార్తలపై స్పందిస్తూ రెండు సంవత్సరాల క్రితం ఒప్పుకున్న సినిమాలే ఇప్పుడు చేస్తున్నానని అప్పుడు ఏ రెమ్యునరేషన్ తీసుకున్నానో ఇప్పటికీ అదే రెమ్యునరేషన్ తీసుకుంటున్నానని అన్నారు.

ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేసిన తర్వాతే తాను రెమ్యునరేషన్ ను పెంచుతానని సుహాస్ కామెంట్లు చేశారు. నా మ్యారేజ్ అనుకోకుండా జరిగిందని సుహాస్ కామెంట్లు చేశారు. చిన్న తిరుపతిలో నేను పెళ్లి చేసుకున్నానని ఆయన అన్నారు. తాళిబొట్టు కొనుక్కొని బట్టలు కొనుక్కొని వెళ్లానని సుహాస్ కామెంట్లు చేశారు. ఆ సమయంలో పంతులు నీ అవతారమేంటి.. నువ్వు పెళ్లికొడుకువేంటి అని తిట్టారని సుహాస్ వెల్లడించారు.

నా పెళ్లికి ఎలాంటి బ్యాండ్ లేదని సుహాస్ కామెంట్లు చేశారు. సుహాస్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సుహాస్ టాలెంట్ కు తగ్గ మరిన్ని విజయాలు దక్కాలని ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధించేలా సుహాస్ అడుగులు పడాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సినిమా సినిమాకు సుహాస్ రేంజ్ పెరుగుతోంది.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags