Tiger3: టైగర్3 మూవీ యాక్షన్ సీన్ల గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన టైగర్3 మూవీ ఈ నెల 12వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీ రిలీజ్ కు సమయం దగ్గర పడుతుండగా ఈ సినిమాకు సంబంధించిన షాకింగ్ అప్ డేట్స్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో 12 యాక్షన్ సీక్వెన్స్ లు ఉన్నాయని భోగట్టా. ఈ యాక్షన్ సీక్వెన్స్ లు అద్భుతంగా నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని తెలుస్తోంది.

యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కగా ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని సల్మాన్ ఖాన్ కు ఈ సినిమా ఆ లోటును తీరుస్తుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తెలుగు, తమిళంతో పాటు హిందీ భాషలలో ఈ సినిమా రిలీజ్ కానుంది. మనీష్ శర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం గమనార్హం.

హాలీవుడ్ యాక్షన్ సీన్లకు ధీటుగా ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఉండనున్నాయని తెలుస్తోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా ఈ సినిమా తెరకెక్కింది. ఒకింత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సంచలనాలు సృష్టిస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. టైగర్3 సినిమాలో ఎన్టీఆర్ గెస్ట్ రోల్ చేశారని వార్తలు వినిపించినా ఆ వార్తల్లో నిజం లేదని క్లారిటీ వచ్చింది.

తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమాకు బుకింగ్స్ ఆశాజనకంగా లేవు. (Tiger3) టైగర్3 ట్రైలర్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ రావడం గమనార్హం. టైగర్3 సినిమాకు వార్2 సినిమాకు లింక్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. సల్మాన్ ఖాన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. దీపావళి కానుకగా థియేటర్లలో విడుదలవుతున్న సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus