Vijay Antony: చేతిలో రూపాయి కూడా లేని జీవితం గడిపా.. విజయ్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

తక్కువ సినిమాల్లోనే నటించినా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ నటులలో విజయ్ ఆంటోని ఒకరనే సంగతి తెలిసిందే. విజయ్ ఆంటోని విభిన్నమైన కథలలో నటిస్తూ అన్ని భాషల ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. కోలీవుడ్ ఇండస్ట్రీతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా విజయ్ ఆంటోనికి మంచి పేరు ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన విజయ్ ఆంటోని ప్రస్తుతం నటుడిగా సత్తా చాటుతున్నారు. ఒక ఇంటర్వ్యూలో విజయ్ ఆంటోని మాట్లాడుతూ తండ్రి ప్రభుత్వ ఉద్యోగి అని నాన్న మరణం తర్వాత ఆర్థిక కష్టాలు మొదలయ్యాయని అన్నారు.

నాన్న ఉద్యోగం అమ్మకు వచ్చినా సొంతిల్లు లేకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చిందని విజయ్ ఆంటోని వెల్లడించారు. అద్దెకు ఇల్లు దొరకకపోవడంతో ఆమ్మ, చెల్లి, నేను వేర్వేరుగా హాస్టళ్లలో ఉన్నాయని విజయ్ వెల్లడించారు. అమ్మ మరో చోట ఉన్న సమయంలో హాస్టల్ కు హాలిడేస్ ఇవ్వడంతో ఆ సమయంలో ఆకలి కేకలు చూశానని అరటి పళ్లతో కాలం గడిపానని పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీలోకి వస్తే డబ్బు సంపాదించడంతో పాటు మంచి పేరు వస్తుందని నేను భావించానని విజయ్ ఆంటోని అన్నారు.

కొన్ని సినిమాలకు నేను ఎడిటర్ గా కూడా పని చేశానని ఆయన కామెంట్లు చేశారు. నకిలీ, బిచ్చగాడు సినిమాలతో తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు వచ్చిందని విజయ్ ఆంటోని పేర్కొన్నారు. బిచ్చగాడు మూవీ కథ విన్న సమయంలో ఏడ్చానని (Vijay Antony) విజయ్ ఆంటోని పేర్కొన్నారు. నా భార్య నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉంటుందని ఆయన తెలిపారు.

బిచ్చగాడు2 మూవీ బిచ్చగాడు సినిమాకు సీక్వెల్ కాదని బిచ్చగాడు2 సినిమాలో డబ్బు గురించి ప్రధానంగా చర్చించామని ఆయన తెలిపారు. విజయ్ ఆంటోని వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus