Mrunal Thakur : ఆ రీజన్ వల్లే మృణాల్ ఠాకూర్ అలాంటి ఫోటోలు షేర్ చేస్తుందా?

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన మృణాల్ ఠాకూర్ కు ప్రస్తుతం తెలుగులో వరుసగా సినిమా ఆఫర్లు వస్తున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమెను అభిమానించే అభిమానుల సంఖ్య సైతం పెరుగుతోంది. అయితే సీతారామం సినిమాలో ట్రెడిషనల్ గా కనిపించిన మృణాల్ ఠాకూర్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలను షేర్ చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. మృణాల్ ఠాకూర్ షేర్ చేస్తున్న ఫోటోలకు సంబంధించి నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ట్రెడిషనల్ గానే కనిపిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. అయితే మృణాల్ గ్లామర్ షో వెనుక అసలు ప్లాన్ వేరే ఉందని తెలుస్తోంది. ట్రెడిషనల్ గా కనిపిస్తే ఒకే తరహా పాత్రలకే పరిమితం కావాల్సి ఉంటుందని ఆమె ఫీలవుతున్నారని బోగట్టా. రాబోయే రోజుల్లో తెలుగులో గ్లామరస్ రోల్స్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఆమె భావిస్తున్నారని తన ఫోటోల ద్వారా దర్శకనిర్మాతలకు ఈ అభిప్రాయాన్ని మృణాల్ వెల్లడిస్తున్నారని తెలుస్తోంది.

తర్వాత ప్రాజెక్ట్ లతో సక్సెస్ సాధిస్తే మాత్రం మృణాల్ రెమ్యునరేషన్ కూడా పెరిగే ఛాన్స్ అయితే ఉంది. కెరీర్ విషయంలో మృణాల్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. హిందీలో కూడా మృణాల్ కు ఆఫర్లు పెరుగుతున్నాయి. మృణాల్ ప్రస్తుతం నాని30 సినిమాలో నటిస్తున్నారు. నాని వరుసగా విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో మృణాల్ కు కూడా కోరుకున్న విజయం దక్కే ఛాన్స్ ఉంది. మృణాల్ రూపంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి మరో మంచి హీరోయిన్ దొరికినట్టేనని కొంతమంది నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మృణాల్ కథల ఎంపికలో, పాత్రల ఎంపికలో జాగ్రత్త వహించాలని అభిమానులు చెబుతున్నారు. మృణాల్ ఠాకూర్ కు స్టార్ హీరోల సినిమాలలో కూడా ఆఫర్లు వస్తే ఆమె రేంజ్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. మృణాల్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus