Son of India: ఆ రీజన్ వల్లే సినిమా ఫ్లాపైందన్న సునీల్ చక్రవర్తి!

కలెక్షన్ కింగ్ గా ప్రముఖ నటుడు మోహన్ బాబుకు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే. మోహన్ బాబు నటించిన సన్ ఆఫ్ ఇండియా పరవాలేదనే స్థాయి అంచనాలతో థియేటర్లలో విడుదల కాగా ఈ సినిమాకు నెగిటివ్ రివ్యూలతో పాటు నెగిటివ్ టాక్ వచ్చింది. వీకెండ్ లో కూడా ఆశించిన స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడంలో సన్ ఆఫ్ ఇండియా సినిమా ఫెయిలైంది. ఈ సినిమా వల్ల భారీ మొత్తంలో నష్టాలు మిగిలాయనే కామెంట్లు సైతం వినిపిస్తుండటం గమనార్హం.

Click Here To Watch

అయితే ఈ సినిమా ఫ్లాప్ కావడానికి గల కారణాలను మంచు యువసేన ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సునీల్ చక్రవర్తి తాజాగా చెప్పుకొచ్చారు. గత రెండు దశాబ్దాలుగా తాను ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గా ఉన్నానని ఇప్పటివరకు ఏ హీరోను ట్రోల్ చేయలేదని ఆయన అన్నారు. సన్ ఆఫ్ ఇండియా ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత అసభ్య పదజాలంతో కొందరు మోహన్ బాబు, విష్ణు, లక్ష్మీప్రసన్నలను ట్రోల్ చేశారని ఆయన అన్నారు.

సన్ ఆఫ్ ఇండియా మూవీ రిలీజ్ కావడానికి ముందే ఆ సినిమా గురించి నెగిటివ్ ప్రచారం జరిగిందని సినిమా చూడకుండా సినిమా బాలేదని చేసిన ట్రోల్స్ వల్ల సినిమాకు కలెక్షన్లు రాలేదని సునీల్ చక్రవర్తి చెప్పుకొచ్చారు. సినిమా ఫ్లాపైతే మోహన్ బాబుతో పాటు ఈ సినిమాకు పని చేసిన వాళ్లందరిపై ఆ ప్రభావం పడుతుందని సునీల్ చక్రవర్తి కామెంట్లు చేశారు. అసభ్యకర మాటలతో సోషల్ మీడియాలో మంచు లక్ష్మీని కూడా ట్రోల్ చేస్తున్నారని ఆయన అన్నారు.

కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు మంచు కుటుంబాన్ని ట్రోల్ చేస్తూ బ్రతుకుతున్నాయని మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు అయిన తర్వాత ఈ ట్రోల్స్ ఎక్కువయ్యాయని ఆయన చెప్పుకొచ్చారు. మోహన్ బాబును, ఆయన కుటుంబ సభ్యులను ట్రోల్ చేసేవాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆయన వెల్లడించారు.

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus