షాకిస్తున్న ‘షాదీ ముబారక్’ మూవీ ఐ.ఎం.డి.బి రేటింగ్..!

ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ అంటే చాలా మందికి త్వరగా స్ట్రైక్ అవ్వదేమో ..కానీ ఐ.ఎం.డి.బి అనగానే అందరికీ వెంటనే అవుతుంది. ఎన్నో సంవత్సరాలుగా ఐ.ఎం.డి.బి… అన్ని భాషల సినిమాలకు రేటింగ్స్ ఇస్తూ వస్తోంది. ఏ సినిమా డీటెయిల్స్ చూడాలి అన్నా… ఐ.ఎం.డి.బి నే ప్రిఫర్ చేస్తుంటారు సినీ లవర్స్. దీని పై వారికి గల నమ్మకం కూడా ఆ రేంజ్లో ఉంటుంది. ఒక్క సినిమాలకు మాత్రమే కాదు వెబ్ సిరీస్ లకు కూడా ఐ.ఎం.డి.బి రేటింగ్స్ ఇస్తుంటుందన్న సంగతి తెలిసిందే.

అంతేకాదు సెలబ్రిటీలకు సంబంధించిన బయోడేటా ను కూడా చాలా మంది ఇక్కడ నుండే సేకరిస్తూ ఉంటారు. ఇక ఏ సినిమాకి అయినా సరే ఐ.ఎం.డి.బి రేటింగ్ బాగుంది అంటే.. కచ్చితంగా ఆ సినిమాని చూడాలని సినీ లవర్స్ ఫిక్స్ అయిపోతుంటారు. అలాంటి ఐ.ఎం.డి.బి వారు ఇటీవల ‘షాదీ ముబారక్’ అనే సినిమాకి ఇచ్చిన రేటింగ్ ఎంతో తెలుసా..? ఏకంగా 9.1 / 10. దిల్ రాజు నిర్మాణంలో ‘మొగలిరేకులు’ ఫేమ్ సాగర్(ఆర్.కె.నాయుడు) నటించిన ఈ చిత్రం మార్చి 5న విడుదల అయ్యింది.

థియేటర్లలో ఈ చిత్రాన్ని చూడడానికి ప్రేక్షకులు ఎవ్వరూ ముందుకు రాలేదు. కానీ రివ్యూలు, రేటింగ్ లు బాగున్నాయి. మంచిగా ప్రమోషన్ చేసి ఈ చిత్రాన్ని కనుక విడుదల చేసి ఉంటే.. కచ్చితంగా పెద్ద హిట్ అయ్యి ఉండేది. అయితే ఈ చిత్రానికి ఐ.ఎం.డి.బి రేటింగ్ బాగా నమోదు కావడంతో ప్రేక్షకులు డిజిటల్ రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus