Jr NTR, Koratala Siva: ఎన్టీఆర్ కొరటాల మూవీ షూటింగ్ ఎప్పుడంటే?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబో మూవీ కోసం ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు క్లారిటీ రావడం లేదు. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలు కావడానికి రెండు నెలల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. తాజాగా ఎన్టీఆర్ కు చిన్న సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. అయితే డాక్టర్లు మాత్రం ఎన్టీఆర్ కు ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్టు సమాచారం.

ఎన్టీఆర్ కనీసం రెండు నెలలు రెస్ట్ తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరోవైపు కొరటాల శివ సినిమా కోసం ఎన్టీఆర్ బరువు తగ్గాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ ఐదు కేజీల బరువు తగ్గాలని భావిస్తున్నట్టు బోగట్టా. ఎన్టీఆర్ రెండు నెలల పాటు బరువైన వస్తువులు ఎత్తకూడదని డాక్టర్లు సూచించారని సమాచారం. ఎన్టీఆర్ కొరటాల కాంబో మూవీ ఈ సినిమా కోసం ప్రస్తుతం భారీ సెట్ రెడీ అవుతోందని ఆ సెట్ లోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది.

ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేయడానికి సిద్ధమవుతుండటం గమనార్హం. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమాలో, సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్ లో మరో సినిమాలో నటించనున్నారు. ఎన్టీఆర్ భవిష్యత్తు సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమాతో వచ్చిన క్రేజ్ ను సరైన విధంగా వినియోగించుకోవాలని తారక్ భావిస్తున్నారు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus