Prabhas: ఆదిపురుష్ మూవీ విషయంలో అలా జరుగుతోందా?

ప్రభాస్ హీరోగా ఓం రౌత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా 2023 సంవత్సరం సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుందని ప్రకటన వెలువడింది. ఈ సినిమా రిలీజ్ కు ఆరు నెలల సమయం ఉండగా ఇప్పటివరకు ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుకాలేదు. అయితే ఈ సినిమా మరోసారి వాయిదా పడిందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

భారీ మోషన్ గ్రాఫిక్స్ మూవీగా ఈ సినిమా తెరకెక్కగా ప్రభాస్ కు జోడీగా కృతి సనన్ ఈ సినిమాలో నటించారు. ఆదిపురుష్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు అంతకంతకూ ఆలస్యమవుతున్నాయని అందువల్ల ఈ సినిమా వాయిదా పడటం గ్యారంటీ అని ప్రచారం జరుగుతోంది. ఆదిపురుష్ మరోసారి వాయిదా పడితే 2022 సంవత్సరం ఆగష్టు నెలలో ఈ సినిమా రిలీజయ్యే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది. వైరల్ అవుతున్న వార్తలు ప్రభాస్ అభిమానులకు చిరాకు తెప్పించే విధంగా ఉన్నాయి.

ఆదిపురుష్ గురించి జరుగుతున్న ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. ప్రభాస్ ఇతర ప్రాజెక్ట్ లతో పోల్చి చూస్తే ఈ సినిమాపై ఆశించిన స్థాయిలో అంచనాలు పెరగలేదని ఫ్యాన్స్ లో ఒకింత అసంతృప్తి నెలకొంది. సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయితే సినిమా రిజల్ట్ పై ఆ ప్రభావం కచ్చితంగా పడుతుంది. దాదాపుగా 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.

ఈ సినిమా దేశవిదేశాల్లో రికార్డు స్థాయి స్క్రీన్లలో రిలీజ్ కానుందని ఈ సినిమాతో ప్రభాస్ కు గ్లోబల్ స్టార్ గా గుర్తింపు రావడం ఖాయమని తెలుస్తోంది. ప్రభాస్ నటిస్తున్న సలార్ కూడా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ప్రభాస్ మారుతి కాంబో మూవీ షూట్ కు, రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus