Prabhas: స్టార్ హీరో ప్రభాస్ అభిమానులకు షాకింగ్ న్యూస్ ఇదే!

ప్రభాస్ హీరోగా ఓం రౌత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమాపై ఇప్పుడిప్పుడే అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమా నుంచి వస్తున్న అప్ డేట్స్ వల్ల ప్రభాస్ అభిమానులతో పాటు సాధారణ అభిమానులు సైతం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్రీడీలో ఈ సినిమా అద్భుతంగా ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా ట్రైలర్ నిడివి 3 నిమిషాల 22 సెకన్లు అని సమాచారం. ప్రభాస్ ఈ సినిమా ప్రమోషన్స్ కోసం డేట్స్ కేటాయించారని బోగట్టా.

అయితే ఈ సినిమాలో విలన్ రోల్ లో చేసిన సైఫ్ అలీ ఖాన్ మాత్రం ఈ మూవీ ప్రమోషన్స్ కు దూరంగా ఉండనున్నారని సమాచారం అందుతోంది. సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమా ప్రమోషన్స్ కు దూరంగా ఉండటం అంటే ప్రభాస్ అభిమానులకు ఒకింత షాక్ అనే చెప్పాలి. సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటే ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగే అవకాశం ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం కూడా భారీ స్థాయిలోనే ఖర్చు చేస్తున్నారని సమాచారం అందుతోంది.

ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్ (Prabhas) ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించనున్నారని తెలుస్తోంది. పలు మీడియా సంస్థలకు ప్రభాస్ ఇంటర్వ్యూలు కూడా ఇవ్వనున్నారని తెలుస్తోంది. సైఫ్ అలీఖాన్ వచ్చే నెలలో సమ్మర్ వెకేషన్స్ కు వెళ్లనున్నారని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో సీత పాత్రలో కృతి సనన్ కనిపించనున్నారు.

ఈ సినిమా ఏకంగా 600 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కింది. తెలుగు రాష్ట్రాల్లో యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఆదిపురుష్ రిలీజ్ సమయానికి ఈ సినిమాపై నెగిటివిటీ పూర్తిస్థాయిలో తగ్గే ఛాన్స్ ఉంది. స్టార్ హీరో ప్రభాస్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus