RRR Movie: ఆర్ఆర్ఆర్ మూవీ విషయంలో నిర్ణయం మారిందా?

ఆర్ఆర్ఆర్ మూవీ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సాధిస్తున్న సంగతి తెలిసిందే. ఓవర్సీస్ లో ఫుల్ రన్ లో ఆర్ఆర్ఆర్ మూవీ బాహుబలి2 కలెక్షన్లను బ్రేక్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో ఆర్ఆర్ఆర్ మూవీ డాల్బీ విజన్, సినీమార్క్ ఎక్స్.డీ ఫార్మాట్ లలో ప్రదర్శితమవుతోంది. ఆర్ఆర్ఆర్ మూవీకి ఓవర్సీస్ లో వీక్ డేస్ లో కూడా బాగానే కలెక్షన్లు వస్తున్నాయి.

Click Here To Watch NOW

అయితే డాల్బీ విజన్, సినీమార్క్ ఎక్స్.డీ ఫార్మాట్ లలో మరో మూడు రోజులు మాత్రమే అమెరికాలో ఈ సినిమా ప్రదర్శితం కానుందని తెలుస్తోంది. ఆ తర్వాత అక్కడ సాధారణ ప్రింట్ ను మాత్రమే ప్రదర్శిస్తారని సమాచారం. అమెరికాలో డాల్బీ విజన్, సినీమార్క్ ఎక్స్.డీ ఫార్మాట్ లలో సినిమాను చూడాలని భావించే ప్రేక్షకులు వెంటనే సినిమాను చూస్తే మంచిదని చెప్పవచ్చు. అక్కడి డిస్ట్రిబ్యూటర్ల నిర్ణయం వల్లే ఆర్ఆర్ఆర్ ప్రదర్శనల విషయంలో మార్పులు చోటు చేసుకున్నాయని తెలుస్తోంది.

మరోవైపు వీక్ డేస్ లో కూడా ఆర్ఆర్ఆర్ మూవీ కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సాధిస్తోంది. ఏపీలో టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటం ఈ సినిమాకు కలిసొచ్చింది. మరోవైపు ఈ సినిమా ఓటీటీ వెర్షన్ రిలీజ్ కు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. పుష్ప, రాధేశ్యామ్ సినిమాలు రిలీజైన మూడు వారాలకే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండటంతో ఆర్ఆర్ఆర్ ఓటీటీ వెర్షన్ రిలీజ్ డేట్ కోసం కొందరు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఆర్ఆర్ఆర్ ఓటీటీ రిలీజ్ గురించి క్లారిటీ రావాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఆర్ఆర్ఆర్ ఫుల్ రన్ లో ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ మూవీ 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు ఊహించని స్థాయిలో లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus