Sudhakar: పాపం.. సుధాకర్ పై ఫేక్ ప్రచారం.. షాక్ లో సినీ పరిశ్రమ!

కొద్దిరోజుల క్రితం సీనియర్ నటుడు శరత్ బాబు చనిపోయినట్టు ఫేక్ వార్తలు ప్రచారమయ్యాయి. ఈ విషయం పై శరత్ బాబు ఫ్యామిలీ మండిపడింది. హాస్పిటల్ సిబ్బంది కూడా ఈ విషయం పై క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. అయితే అనూహ్యంగా ఈరోజు శరత్ బాబు కన్నుమూశారు. కానీ ఆయన చనిపోకుండా చనిపోయారు అంటూ ప్రచారం జరగడం అనేది.. ఆయన కుటుంబ సభ్యులను బాగా బాధపెట్టింది. గతంలో కూడా కొంతమంది నటీనటులు కన్నుమూసినట్టు ప్రచారం జరిగింది.

దీంతో సదరు నటీనటులు లైవ్ లోకి వచ్చి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. సరిగ్గా ఇలాగే.. ఇప్పుడు సీనియర్ నటుడు సుధాకర్ కన్నుమూసినట్టు ప్రచారం మొదలైంది. కానీ ఇది కూడా ఫేక్ న్యూస్ అని తేలిపోయింది. అయితే సుధాకర్ ప్రస్తుతం బాగానే ఉన్నారు. కొన్నాళ్ల క్రితం ఆయన కండిషన్ సీరియస్ అవ్వడంతో హాస్పిటల్ లో చేరారు. వైద్యులు ఆయనకు మెరుగైన చికిత్స అందించడంతో కోలుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది.

కెరీర్ ప్రారంభంలో (Sudhakar) సుధాకర్ హీరోగా పలు సినిమాల్లో నటించారు. ఒకటి రెండు సక్సెస్ లు కూడా ఆయనకు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి, సుధాకర్, జి.వి.నారాయణ రావు, ప్రసాద్ బాబు బెస్ట్ ఫ్రెండ్స్. గతంలో చిరంజీవి నటించిన చాలా వరకు సినిమాల్లో వీళ్లంతా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా చేసేవారు.

వీళ్ళను బిజీ ఆర్టిస్ట్ లుగా నిలపడంలో కూడా చిరు సక్సెస్ అయ్యారు. సుధాకర్ అయితే స్టార్ కమెడియన్ గా ఎదిగారు. సుధాకర్ చివరిగా నితిన్ హీరోగా తెరకెక్కిన ‘ద్రోణ’ సినిమాలో కనిపించారు. అలాగే ‘eee ‘ అనే మరో చిత్రంలో కూడా నటించారు. కానీ ఈ సినిమా గురించి ఎక్కువ మందికి తెలిసుండదు.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus