Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు ఇది షాకింగ్ న్యూస్.. ఏమైందంటే?

పుష్ప ది రైజ్ సినిమా అంచనాలకు మించి విజయం సాధించడంతో పుష్ప ది రూల్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దర్శకుడు సుకుమార్ పుష్ప ది రూల్ స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేశారని వార్తలు వైరల్ అయ్యాయి. పుష్ప ది రూల్ లో ఫహద్ ఫాజిల్ మెయిన్ విలన్ గా నటిస్తున్నారనే సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో విజయ్ సేతుపతి మరో విలన్ గా నటిస్తున్నారని ప్రచారం జరిగింది.

వైరల్ అయిన వార్తలను బన్నీ అభిమానులలో చాలామంది నిజమేనని నమ్మారు. అయితే విజయ్ సేతుపతి సన్నిహితులు మాత్రం వైరల్ అయిన వార్తలో ఏ మాత్రం నిజం లేదని చెబుతున్నారు. విజయ్ సేతుపతి ప్రస్తుతం హిందీ మూవీ జవాన్ లో మాత్రమే నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో నటిస్తున్నారని ఆయన మరే ప్రాజెక్ట్ లో నటించడం లేదని క్లారిటీ వచ్చింది. ఈ వార్త వల్ల బన్నీ అభిమానులు ఒకింత నిరాశ చెందుతున్నారు.

మరోవైపు త్వరలో పుష్ప ది రూల్ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. పుష్ప ది రూల్ లో రష్మిక పాత్రకు కూడా భారీ స్థాయిలో ప్రాధాన్యత ఉండనుందని సమాచారం. పుష్ప ది రైజ్ పాటలు ఊహించని స్థాయిలో హిట్ కాగా పుష్ప ది రూల్ పాటలు సైతం అంతకు మించి హిట్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

దేవిశ్రీ ప్రసాద్ సైతం ఈ సినిమా కోసం తీవ్రస్థాయిలో కష్టపడుతున్నారని సమాచారం అందుతోంది. సుకుమార్ ఈ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరోవైపు బన్నీ మల్టీస్టారర్ సినిమాలలో నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మంచి కథ దొరికితే బన్నీని మల్టీస్టారర్ సినిమాలలో చూసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus