Balakrishna: బాలయ్యనే డామినేట్ చేసేలా ఆ రోల్ క్రియేట్ చేశారా.. ఏమైందంటే?

సాధారణంగా బాలయ్య (Nandamuri Balakrishna) సినిమాలలో ఆయన రోల్ మాత్రమే డామినేటింగ్ గా ఉంటుంది. అఖండ (Akhanda) , వీరసింహారెడ్డి (Veera Simha Reddy) , భగవంత్ కేసరి (Bhagavath Kesari) ఇలా ఏ సినిమా చూసినా బాలయ్య రోల్ ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేశారు. అయితే బాలయ్య బాబీ (K. S. Ravindra) కాంబో సినిమాలో మాత్రం బాబీ డియోల్ రోల్ హీరో రోల్ కంటే పవర్ ఫుల్ గా ఉంటుందని తెలుస్తోంది. బాబీ డియోల్ (Bobby Deol) పాత్రను ప్రేక్షకుల ఊహలకు భిన్నంగా దర్శకుడు క్రియేట్ చేశారని తెలుస్తోంది.

వరుసగా తెలుగు సినిమాలలో బిజీ అవుతున్న బాబీ డియోల్ భవిష్యత్తులో ఈ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో బిజీ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. యానిమల్ (Animal) సినిమా సక్సెస్ తర్వాత బాబీ డియోల్ కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే రాలేదని సమాచారం అందుతోంది. బాలయ్య బాబీ కాంబో సినిమాకు సంబంధించి త్వరలో క్రేజీ అప్ డేట్స్ రానున్నాయని భోగట్టా.

స్టార్ హీరో బాలకృష్ణ అదిరిపోయే స్క్రిప్ట్ లను ఎంపిక చేసుకుంటూ సక్సెస్ ఫుల్ గా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఆరు పదుల వయస్సులో కూడా బాలయ్య వరుస విజయాలను సొంతం చేసుకునేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. స్టార్ హీరో బాలకృష్ణ సీనియర్ హీరోలలో రెమ్యునరేషన్ పరంగా కూడా టాప్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే. సినిమా సినిమాకు బాలయ్య బాక్సాఫీస్ రేంజ్ పెరుగుతోంది.

బాలయ్య భవిష్యత్తు సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతుండటం ఆయన కెరీర్ కు మరింత ప్లస్ అవుతోంది. యంగ్ జనరేషన్ హీరోలు సైతం బాలయ్యను ఎంతో అభిమానిస్తుండటం గమనార్హం. త్వరలో బాలయ్య అన్ స్టాపబుల్ తర్వాత సీజన్ తో కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం నిజమవుతుందో లేదో తెలియాల్సి ఉంది. మాస్ సినిమాలతో బాలయ్య ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus