Bigg Boss 5 Telugu: ఎవరికీ దక్కని పవర్ హమీదకి దక్కింది..!
- September 9, 2021 / 06:31 AM ISTByFilmy Focus
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో ప్రస్తుతం శక్తిచూపరా ఢింబకా అనే టాస్క్ నడుస్తోంది. ఇందులో బాగంగా హౌస్ మేట్స్ పవర్ రూమ్ లోకి వెళ్లేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ఫస్ట్ ఈ పవర్ ని విశ్వ దక్కించుకున్నాడు. విశ్వ సెలక్ట్ చేసిన హౌస్ మేట్స్ తమ బట్టలని, వస్తువులని బిగ్ బాస్ కి అప్పజెప్పేశారు. అంతేకాదు, అపోజిట్ జెండర్ దుస్కులు ధరించారు కూడా. ఆ తర్వాత మానస్ పవర్ దక్కించుకున్నాడు.
మానస్ సెలక్ట్ చేసిన హౌస్ మేట్ అయిన కాజల్ అందరూ నిద్రపోయాకే నిద్రపోవాలి. లేదంటే మెలకువగానే ఉండాలి. ఇక మూడోసారి పవర్ రూమ్ యాక్సెస్ ని దక్కించుకుంది సిరి. సిరి సెలక్ట్ చేస్కున్న హౌస్ మేట్స్ ఒకరు సేవకుడిగా ఒకరు యజమానిగా వ్యవహరించాలి. సిరి సేవకుడిగా లోబోని, యజమానిగా షణ్ముక్ ని సెలక్ట్ చేస్కుంది. దీంతో వారిద్దరూ హౌస్ లో కాసేపు ఫన్ జనరేట్ చేశారు. ఇక నాలుగోసారి థండర్ సౌండ్ వచ్చినపుడు పవర్ రూమ్ యాక్సెస్ ని దక్కించుకుంది హమీద.

హమీదకి అద్దిరిపోయే పవర్ ఇచ్చాడు బిగ్ బాస్. హమీద సెలక్ట్ చేస్కున్న హౌస్ మేట్ ఈసీజన్ లో ఎప్పటికీ కెప్టెన్ కాలేరు. ఇక్కడే హమీద ఎవరిని సెలక్ట్ చేస్కుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఎవ్వరికీ దక్కని పవర్ ఇప్పుడు హమీదాకి దక్కింది. మరి హమీద ఈ పవర్ ని ఎవరిపైన ఉపయోగిస్తుందనేది చూడాలి.
బిగ్ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
[yop_poll id=”2″]
Most Recommended Video
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!










